ఈ వి ఎం గోదాములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి
నెల్లిమర్ల, (విజయనగరం), అక్టోబరు 28 ః స్థానిక ఈవిఎం గోదాములను జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. గోదాము షట్టర్లకు వేసిన సీళ్లను, తాళాలను పరిశీలించారు. బందోబస్తుపై సమీక్షించారు. సిసి కెమేరాల ద్వారా చుట్టుప్రక్కల పరిస్తితులను పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను, పోలీసు సిబ్బందిని ఆదేశించారు. డిఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, నెల్లిమర్ల తాహసీల్దార్ శ్రీకాంత్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటిండెంట్ భాస్కర్రావు, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.