logo

*తొర్రూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం

తొర్రూరు అక్టోబర్ 14 (AIMEMEDIA) లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు అధ్యక్షులు లయన్ డాక్టర్ సూర్నం రామ నర్సయ్య ఆధ్వర్యంలో మంగళవారం క్లబ్ సెక్రటరీ ముడుపు రవీందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.పట్టణ కేంద్రంలోని వందేమాతరం ఫౌండేషన్ లో బియ్యం నిత్యవసర సరుకులు, ఖానాపురం పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులు, పలకలు, బలపాలు, వాటర్ బాటిల్ లు, కుమ్మరి కుంట్ల పాఠశాలలో బ్యాగ్స్, ఆల్ ఇన్ వన్ పుస్తకాలు, హమాలి కూలీలకు టీ షర్ట్ లు పంపిణీ చేశారు.అంబేద్కర్ క్రాస్ రోడ్డులో అన్న ప్రసాద వితరణ, ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నప్రసాద,మందుల పంపిణీ చేసి డాక్టర్లను సన్మానం చేశారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా రామ నరసయ్య మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ప్రతినిధుల జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిస్టిక్ జిఎంటి కోఆర్డినేటర్ లయన్ వెంకటరెడ్డి,లయన్ ఎవల్యూషన్ చైర్మన్ రేగురి వెంకన్న, ఆర్ సి దామెర సరేష్, జెడ్ సి చిదిరాల నవీన్, క్లబ్ సెక్రటరీ ముడుపు రవీందర్ రెడ్డి, క్లబ్ ట్రెజరర్ వజినపల్లి శ్రీనివాస్,క్లబ్ జాయింట్ సెక్రెటరీ బోనగిరి శంకర్, వేముల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

0
77 views