logo

తొర్రూరు లయన్స్ క్లబ్ కు టాప్ ఫర్ఫార్మెన్స్ అవార్డు *–జిల్లా ఉత్తమ క్లబ్ గా గుర్తింపు* అవార్డు స్వీకరిస్తున్న క్లబ్ అధ్యక్షుడు రామ నర్సయ్య

తొర్రూరు,అక్టోబర్13(AIEMEDIA):ఉమ్మడి జిల్లాలోని 77 క్లబ్ లలో ఉత్తమ పనితీరు కనబరిచిన క్లబ్ గా తొర్రూరు లయన్స్ క్లబ్ నిలిచింది.
తమ సేవానిరతి తో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే తొర్రూరు లయన్స్ క్లబ్ మేటి క్లబ్ గా నిలిచింది.తాజాగా హనుమకొండలో లయన్స్ క్లబ్ త్రైమాసిక పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సేవా కార్యక్రమాల నిర్వహణలో ప్రథమ స్థానంలో నిలిచి ,లయన్స్ క్లబ్ ఫస్ట్ బెస్ట్ టాప్ ఫర్ఫార్మెన్స్ పురస్కారం దక్కించుకుంది.లైన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ సూర్ణం రామ నర్సయ్య ఆధ్వర్యంలో మూడు మాసాల్లో 300 పైచిలుకు సేవలు అందించినందుకు గాను తొర్రూరు క్లబ్ కు ఈ పురస్కారం అందుకున్నారు .ఎల్సీఐఎఫ్ ఏరియా ప్రతినిధి దీపక్ భట్టాచార్య,జిల్లా గవర్నర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య, ఉప గవర్నర్లు నరహరి సుధాకర్ రెడ్డి,పుట్ట హరికిషన్ రెడ్డి, మాజీ గవర్నర్లు కుందూరు రాజేందర్ రెడ్డి, తమ్మెర లక్ష్మీనరసింహారావు ల సమక్షంలో డాక్టర్ రామ నర్సయ్య పురస్కారాన్ని అందుకున్నారు.
సేవకు ప్రతిరూపం లయన్స్ క్లబ్ అని, అవసరార్థులకు సేవలు అందించడంలో క్లబ్ ఎప్పుడూ ముందు ఉంటుందని జిల్లా గవర్నర్ చంద్రశేఖర్ ఆర్య ప్రశంసించారు .డాక్టర్ రామ నర్సయ్య ఉత్తమ నాయకునిగా వ్యవహరిస్తూ తొర్రూరు లయన్స్ క్లబ్ ను ఉత్తమంగా నిలిపారని, సేవల వేగం పెంచారని అభినందించారు.ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రెటరీ ముడుపు రవీందర్ రెడ్డి,ట్రెజరర్ వజినపల్లి శ్రీనివాస్, జిల్లా ఎవల్యూషన్ చైర్మన్ రేగూరి వెంకన్న,డాక్టర్ శారద,రీజియన్ చైర్మన్ దామెర సరేష్, జోన్ చైర్మన్ చిదురాల నవీన్,ఫాస్ట్ ప్రెసిడెంట్ మాదారపు వేణుగోపాల్,క్లబ్ జాయింట్ సెక్రెటరీ బోనగిరి శంకర్, క్లబ్ ఫాస్ట్ సెక్రెటరీ తమ్మీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

18
923 views