
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోవిద్యార్థులకు పరీక్ష ప్యాడ్ ల అందజేత
ఆలయం లో ప్రసాద వితరణ
అందిస్తున్న ప్రతినిధులు
* సేవా కార్యక్రమాలు*
తొర్రూరు,అక్టోబర్11: AIMEMEDIA లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు అధ్యక్షులు లయన్ డాక్టర్ సూర్నం రామ నరసయ్య ఆధ్వర్యంలో శనివారం పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు.
పిడిజి లయన్ ముచ్చ రాజిరెడ్డి, లయన్ తమ్మెర ఉమా విశ్వేశ్వర రావు, క్లబ్ సెకండ్ వైస్ ప్రెసిడెంట్ లయన్ పెరుమండ్ల రమేష్ కుమారుడు వర్షిత్ గౌడ్ ల పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు.అనంతరం వారి ఆర్థిక సహాకారంతో డివిజన్ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, రోహిత్ హాస్పిటల్ వద్ద అన్నప్రసాద వితరణ, రిక్షా కాలనీలో 20 కుటుంబాలకు చీరలు, టీ షర్టు టవల్స్ పంపిణి, శ్రీ వెంకటేశ్వర ఒకేషనల్ జూనియర్ కళాశాల, ఎస్సీ కాలేజీ హాస్టల్ లో విద్యార్థినిలకు పరీక్ష ఫ్యాడులు,రూ.6 వేల విలువచేసే 3 సీలింగ్ ఫ్యాన్లు అందజేశారు. గోశాల నిర్మాణానికి రూ.3 వేలు అందించారు. చిట్యాల జెడ్పిహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాలు పంపిణీ చేసి మొక్కలు నాటారు.వివిధ వ్యాధుల పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పిడిజి లు లయన్ డాక్టర్ కె రాజేందర్ రెడ్డి,తమ్మెర విశ్వేశ్వర రావు,ఆర్ సి దామేర సరేష్, జోన్ చైర్మన్ చిదిరాల నవీన్,క్లబ్ సెక్రటరీ ముడుపు రవీందర్ రెడ్డి,క్లబ్ ట్రెజరర్ వజినపల్లి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ బోనగిరి శంకర్, పిఆర్సి తమ్మెర వీరభద్రరావు,పాస్ట్ ప్రెసిడెంట్ మున్నురు కోటయ్య, స్కూల్ ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ రమేష్, హాస్టల్ వార్డెన్ మధురిమ,ఉపాధ్యాయ బృందం అశోక్, శ్రీను, సాగర్ తదితరులు పాల్గొన్నారు.