logo

మెగా పశు వైద్య శిభిరం ఏర్పాటు

శేషపు పేటలో మెగా పశు వైద్య శిబిరం :-----

గుర్ల మండలంలో శేషపుపేట గ్రామంలో మెగా పశువైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ పశువైద్య శిబిరంలో గర్భకోశ సంబంధిత సమస్యలకు చికిత్సలు మరియు నివారణలు పాడి రైతులకు అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో 92 పశువులకు గర్భకోశ సంబంధించిన చికిత్సలు అందించి పాడి రైతులకు సరిపడా మందులు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక సంచాలకులు డాక్టర్ మురళీకృష్ణ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణ అధికారి డాక్టర్ రాధాకృష్ణ , విజయనగరం డివిజన్ ఉపసంచాలకులు డాక్టర్ దామోదర్ నాయుడు గుర్ల సహాయ సంచాలకులు డాక్టర్ రమణచలం , గైనిక్ స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ శ్రీ సంధ్య మేడం , పశు వైద్యులు డాక్టర్ శ్రీ లక్ష్మీ డాక్టర్ జగదీష్ , డాక్టర్ సతీష్, గుర్ల పశుసంవర్ధక శాఖ సిబ్బంది, గ్రామ పెద్దలు, పాడి రైతులు పాల్గొనడం జరిగింది..

6
441 views