వినాయక నిమజ్జన కార్యక్రమము ప్రశాంతంగా జరిగేలా చూడాలి
_పర్యవేక్షించిన ఎస్పి రామ్ నాథ్ కేకన్ కేకన్
తొర్రూర్, ఆగస్టు 5 మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు వద్ద ఘనంగా శుక్రవారం వినాయక శోభయాత్రలను ,నిమజ్జన కార్యక్రమాలను జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ స్వయంగా పరిశీలించారు. డివిజన్ కేంద్రంలో పలు చోట్ల వినాయక ప్రతిమలు వాడవాడలా ఏర్పాటు చేసి
తొమ్మిది రోజుల ప్రత్యేక పూజలు అందుకున్న గణ నాథులను శోబాయాన మానంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో ఊరే గింపులతో పెద్ద చెరువులో కోలాహలంగా జరుగుతున్న వినాయక నిమజ్జనం. శాంతియుతంగా జరిగే విధంగా ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీ క్రిష్ణ కిషోర్ పర్యవేక్షణలో నిర్వహించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు . మున్సిపల్ సిబ్బంది గజ ఈతగాళ్ళను ఏర్పాటు చేయగా ,తొర్రూరు సి.ఐ గణేష్ తొర్రూర్ సబ్ ఇన్స్పెక్టర్ జి ఉపేందర్ తమ సిబ్బందితో భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినారు.