
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందిన సబిత
తొర్రూరు సెప్టెంబర్ 5 : సామాజిక అభ్యున్నతే ధ్యేయంగా పెట్టుకుని కేజీబీవీ లపై నమ్మకం కలిగిస్తూ విద్యాబోధన కొనసాగిస్తు ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయురాలు వి సబిత శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా వి . సబితా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ , జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. డివిజన్ కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలలో సిఆర్టి గా విధులు నిర్వహిస్తున్నారు . గతంలో చెన్నారావుపేటలో కూడా ఎంత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల ఉన్నతాధికారుల అభిమానాన్ని చూరగొన్నారు. జ్ఞానం అనేది ఎవరి సొత్తు కాదు చదువుకున్న ప్రతి ఒక్కరి ఆస్తి అని మధ్యలో బడి మానేసిన పిల్లలకు కూడా అత్యున్నతమైన ప్రజ్ఞ కలిగి ఉంటుందని నిరూపిస్తూ ప్రతి సంవత్సరం 100% రిజల్ట్ తెస్తూ కేజీబీవీ తొరూరులో భౌతిక రసాయన శాస్త్రంలో విద్యాబోధన కొనసాగిస్తూ ఆదర్శంగా స్పూర్తిగా నిలిచిన ఉపాధ్యాయురాలు సబిత . తొర్రూర్ పట్టణానికి చెందిన అవార్డు గ్రహీత సబిత మాట్లాడుతూ. తాను గతంలో వాసవి క్లబ్ లైన్స్ క్లబ్ పి ఆర్ టి యు, టి పి యు ఎస్ ,యు టి ఎఫ్, తదితర సంస్థలచే ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందినట్లు చెప్పారు . ఉపాధ్యాయురాలుగా పని చేస్తూనే సేవారంగంలో చురుగ్గా పాల్గొని బ్లాంకెట్స్, ప్లేట్లు ,చైర్స్ ,లైబ్రరీలకు పుస్తకాలు విద్యార్థులకు ఉపయోగపడే ఇతర సామాగ్రిని తన సొంత ఖర్చులతో, పాటు దాతల సహకారంతో అందజేశారు.
సాధారణంగా ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విద్యార్థులకు చదువు చెప్పడంతో పోల్చినప్పుడు మధ్యలో బడి మానేసిన పిల్లలకు జ్ఞానాన్ని అందించడం కొంత కష్టమైన పనే అలాంటి కష్టమైన పనిని ఇష్టంగా చేస్తూ ఆ సబ్జెక్టులో విద్యార్థులు తీసుకుపోరని నిరూపిస్తున్నారు, కేజీబీవీ తొరూరులో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ విద్యార్థులకు బోధనతో పాటుగా వారికి అవసరమయ్యే అవసరాలను తీర్చడంతో, తనను గుర్తించి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు గా అవార్డు స్వీకరించడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని అవార్డు అందజేసిన కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు ,జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి కి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.ఈ అవార్డుతో తనకు మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా సబిత కు భర్త జగదీశ్వర్ , తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి రాంబాబు, అత్తమామలు, తల్లిదండ్రులు బంధువులు శుభాకాంక్షలు తెలిపారు