logo

కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు స్వర్ణ గణపతి వినాయక మండపం వద్ద 5వ రోజు అన్నదానం, సామూహిక కుంకుమ పూజలు

తొర్రూరు ఆగస్టు 31 :స్వర్ణ గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భాగంగా నేడు ఆదివారం 5వ రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కమిటీ అధ్యక్షులు కిన్నెర సతీష్, గౌరవ అధ్యక్షులు తూర్పాటి జీవన్ మాట్లాడుతూ స్వర్ణ గణపతి యూత్ అసోసియేషన్ 16వ వార్షికోత్సవ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దాతల సహకారంతో నిత్యా అన్నదానం మరియు నిత్య లక్ష్మీ గణపతి హోమం ( నవరాత్రులు) నిర్వహిస్తున్నామన్నారు. గత పది సంవత్సరాలుగా పర్యావరణాన్ని కాపాడాలని ముఖ్య ఉద్దేశంతో మట్టి గణపతిని ప్రతిష్టిస్తున్నామన్నారు . ఈ నిత్య అన్నదాన కార్యక్రమంలో సుమారుగా రోజు 500 మంది భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు మారోజు నరేష్ , ప్రధాన కార్యదర్శి ముత్తినేని మణికుమార్ , ప్రచార కార్యదర్శి దాస సాయి తేజ , కోశాధికారి కేతిరెడ్డి ఉపేందర్ రెడ్డి , కమిటీ సభ్యులు మచ్చ సోమయ్య , నాళ్ళ పూర్ణచందర్ , సిరికొండ గణేష్ , మరాఠీ దినేష్ , గజ్జల జీవన్ , మడత ఉమేష్, పేర్ల పెంటయ్య , అన్నదాతలు తదితరులు పాల్గొన్నారు

1
89 views