వాసవి క్లబ్ చే వినాయక మండపం వద్ద అన్న ప్రసాద వితరణ
తొర్రూరు ఆగస్టు 31: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో పలుచోట్ల వినాయక నవరాత్రి సందర్భంగా గణనాధులను నెలకొలిపి పూజా కార్యక్రమాలు, విభిన్న కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ నిర్వహిస్తున్నారు. పట్టణంలోని మంజునాథ కాలనీ గణపతి మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ను వాసవి క్లబ్ తొర్రూర్ అధ్యక్షులు చిదిరాల నవీన్ కుమార్ అధ్యక్షతన వాసవియన్ మహంకాళి రమేష్- మాధవి దంపతుల ఆర్థిక సహాయంతో మహా అన్నదానం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ అధ్యక్షుడు చిదిరాల నవీన్ కుమార్ సి ఎన్ కే ఇన్ఫ్రా డెవలపర్ యజమాని 50 కేజీల బియ్యాన్ని నిర్వాహకులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి ఇమ్మడి రాంబాబు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చ సురేష్ , కోశాధికారి చిదురాల శ్రీనివాస్, గొట్టిముక్కల వెంకట్ రెడ్డి గుండేటి శ్రీనివాస్ రెడ్డి మచ్చ సుధాకర్, వి.జయప్రకాష్ నంగునూరు శ్రీనివాస్ చిన్నాల కాంతయ్య, చింతల పవన్ పైండ్ల రవి తదితరులు పాల్గొన్నారు.