logo

నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే

మెద్చల్ మల్కాజిగిరి // ఉప్పల్

ఉప్పల్ మార్కెట్ వద్ద గల జిల్లా పరిషత్ సెకండరీ హై స్కూల్‌లో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో మాత్రల పంపిణీ చేపడతామని తెలిపారు. 1 నుండి 19 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మాత్రలు తప్పనిసరిగా వాడుకోవాలని సూచించారు. పేగుల్లో ఉండే నులిపురుగులను నివారించడంలో, రక్తహీనత సమస్యను తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఈ మాత్రలు కీలకమని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో DMHO సి. ఉమా గౌరీ గారు, స్కూల్ హెడ్‌మాస్టర్ అశోక్ గారు, Dy DMHO సత్యవతి గారు, DIO కౌశిక్ గారు, ఉప్పల్ మెడికల్ ఆఫీసర్ సౌశిల్యా గారు, ఉప్పల్ డివిజన్ BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, V. ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

4
244 views