
సోమారం ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటా*
*– ‘స్థానికం’లో మద్దతుగా నిలవాలి*
*–పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్*
తొర్రూరు,జులై20(AIMEMEDIA)
తన రాజకీయ అభివృద్ధికి అన్నివేళలా అండగా నిలిచిన సోమారం గ్రామ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ తెలిపారు.ఆదివారం మండలంలోని సోమారం గ్రామంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ సోమారం ప్రజలు గత కొన్ని దశాబ్దాలుగా తన నాయకత్వాన్ని బలపరుస్తున్నారని,తన దుఃఖంలో, సంతోషంలో గ్రామ ప్రజలు భాగస్వాములయ్యారని.. వారి రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు. త్వరలో తన తల్లి పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నానని, దానికై రూ.25 లక్షలు డిపాజిట్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ట్రస్టు ద్వారా గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుంటానని తెలిపారు. ట్రస్టును సైతం గ్రామస్తులే నిర్వహిస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ నాయకులను కలుపుకొని పోవడానికి కృషి చేయాలని, నాయకులను కలుపుకోకపోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందన్నారు.తాను బ్రాహ్మణుడినని.. తనకు పెళ్లి మంత్రాలు వచ్చు.చావు మంత్రాలు వచ్చునని పేర్కొన్నారు. 2001 నుంచి తాను చెప్పినవారు గెలిచారని... అదే కోవలో తాను చెప్పిన మేరకు తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి విజయం సాధించిందని తెలిపారు.
మనకు మద్దతుగా నిలిచిన వారికి అండగా ఉంటామని, ఇబ్బందులు కలిగిస్తే తగు రీతిలో సమాధానం చెప్తామని స్పష్టం చేశారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను బలపరిచిన అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని కోరారు.సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందని తెలిపారు.ఈ సమావేశంలో ఎల్ హెచ్ పి ఎస్ నాయకుడు జాటోత్ బాలు నాయక్, మాజీ సర్పంచ్ లు తమ్మడపల్లి సంపత్, బానోతు చందులాల్,దర్శల కర్ణాకర్, యాకాంతం,స్థానికులు పాల్గొన్నారు.