logo

పాలకుర్తిలో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయం* *– అమెరికా వెళ్ళేది నేను కాదు... ఎర్రబెల్లినే* *–రాజకీయంగా ఆయనకు రిటైర్మెంట్ ఇస్తా* – *స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలి* *– కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి*

తొర్రూరు జూలై 20 (AIMEMIDIA) రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం పాలకుర్తి నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీ గల్లంతవడం ఖాయమని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉప అధ్యక్షులు హనుమాన్ ఝాన్సీ రెడ్డి స్పష్టం చేశారు.ఆదివారం మండలంలోని సోమారం గ్రామంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ క్లస్టర్ సమావేశం నిర్వహించారు. ఝాన్సీ రెడ్డి గ్రామానికి చేరుకోగానే డప్పు, ఒగ్గుడోలు చప్పులు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ కూతురు వయసున్న యశస్విని రెడ్డి పై 48 వేల ఓట్ల తేడా తో ఎర్రబెల్లిని చిత్తుచిత్తుగా ఓడిపోయాడని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే ఫలితం బీఆర్ఎస్ కు పునరావృతం అవుతుందన్నారు.
యశస్విని రెడ్డి, తాను అత్తా కోడలు లా కాకుండా తల్లి బిడ్డలా ఉంటున్నామని, మా మధ్య విభేదాలు సృష్టించడానికి గులాబీ చీడపురుగులు ప్రయత్నాలు చేస్తున్నాయ న్నారు. తాను అమెరికాకు వెళ్తానని, ఇక్కడ అందుబాటులో ఉండనని దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రచారం చేస్తున్న ఎర్రబెల్లినే అమెరికాకు పంపిస్తానే తప్ప పాలకుర్తిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళబోనన్నారు.
పాలకుర్తి నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదం ఉన్నంతవరకు తనను ఎవరు ఏమీ చేయలేరన్నారు. 40ఏళ్లు మేమే ఉంటామన్నారు. సి ఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొందన్నారు.
ఎమ్మెల్యే గెలుపుకు కృషి చేసిన నాయకులను కడుపులో పెట్టుకొని చూసుకుంటానని, వారికి భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తానని స్పష్టం చేశారు. పాత, కొత్త కలయికతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకు వెళుతున్నానని, అందరూ సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ గ్రామంలో కార్యకర్తలు సైనికుల పనిచేసి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. సోమవారం గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు.
ఇందిరా క్రాంతి పథకం కింద ఎస్సీలకు నాటి వైయస్సార్ ప్రభుత్వం భూములు ఇచ్చిందని, ఆ భూముల్లోకి వెళ్ళేందుకు రూ.10 లక్షలతో దారి ఏర్పాటు చేస్తానని తెలిపారు. సోమారం, జమస్తాన్ పురం గ్రామాల్లో రూ.36 లక్షలతో సీసీ రోడ్లు ఏర్పాటు చేయించామని, మరో రూ. 20 లక్షలతో మరికొన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు గ్రామంలో 31 ఇందిరమ్మఇల్లు అందజేశామని, పనులు ప్రారంభం చేస్తామని , ఇంకా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందేలా కృషి చేస్తానని తెలిపారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, ప్రజాభిమానం పొంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు నాయకులు సిద్ధంగా ఉండాలని సూచించారు. అనంతరం గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ కొండ మధుసూదన్ రెడ్డి ఝాన్సీ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్,మండల అధ్యక్షుడు సుంచు సంతోష్,మండల కోఆర్డినేటర్లు ఎర్రబెల్లి రాఘవరావు, చాపల బాపురెడ్డి,జాటోత్ నెహ్రూ నాయక్, సీనియర్ నాయకులు డాక్టర్ పోనుగోటి సోమేశ్వరరావు,పెదగాని సోమయ్య,పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్,మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు పింగిలి ఉష,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు జాటోత్ రవి నాయక్,నాయకులు ధరావత్ రాజేష్ నాయక్,రామచంద్రయ్య, గుండాల నర్సయ్య,ధరావత్ సోమన్న, విద్యాకర్ రెడ్డి,సహదేవ్,గిరిధర్ చిదురాల రవి తదితరులు పాల్గొన్నారు.

0
0 views