logo

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉపహార ప్రసాద వితరణ పంపిణీ లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ రామ్ నరసయ్య ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

తొర్రూరు జూలై 19(AIMEMIDEA)పట్టణ కేంద్రంలోని కంటాయపాలెం రోడ్డులో గల స్థానిక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వికాస తరంగిణి తొర్రూరు శాఖ నిర్వహణలో ప్రతి శనివారం నిర్వహించే శాశ్వత శనివార కైంకరియా సేవలో భాగంగా ఈ శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా తరుణి తొర్రూర్ వారి సౌజన్యంతో పూర్వపు గవర్నర్ లయన్ తమ్మెర లక్ష్మీనరసింహారావు జన్మదినాన్ని పురస్కరించుకొని, డాక్టర్ భూక్య అనిల్ కుమార్ ప్రియాంక పుత్రిక చిరంజీవి వినూత్న శ్రీ జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ పంపిణీ చేశారు.. అనంతరం ఈ ఇరువురి గోత్రనామాలచే ఆలయ ప్రధాన అర్చక స్వామి ఆరుట్ల శ్రీకాంతాచార్యులు అర్చనలు చేసి
ఆశీర్వచనం అందజేశారు.. అనంతరం ఆలయ వ్యవస్థాపకులు డాక్టర్ కుందూరు రాజేందర్ రెడ్డి స్వామి వారి శేష వస్త్రంతో ఇరువురిని ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా తరుణి అధ్యక్ష కార్యదర్శులు మెంబర్స్, వికాస తరంగిణి సభ్యులు, లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూర్ సభ్యులు భక్తులు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి తీర్థ, ఉప ప్రసాదాలను స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు అయ్యారు





లయన్స్ క్లబ్ ఆప్ సేవ తరుణి ఆధ్వర్యంలో...

ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూర్ సేవాతరుణి వారి ఆధ్వర్యంలో క్లబ్ ప్రెసిడెంట్ లయన్ తుమ్మూరు శ్రీదేవి రెడ్డి గారి అధ్యక్షతన, లయన్ పెద్దలు "PDG Ln. తమ్మెర లక్ష్మీ నరసింహరావు" pmjf గారి పుట్టిన రోజును ఘనంగా జరుపుకోవడం జరిగింది. పుట్టినరోజు సందర్భంగా మొదటగా చీరల పంపిణీ కార్యక్రమం, కస్తూరిబా గాంధీ గురుకుల విద్యాలయంలోని విద్యార్థినిలకు నోట్ బుక్స్ పంపిణీ వంటి కార్యక్రమాలను చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్ పెద్దలు మరియు లయన్ మిత్రులు డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి గారు,MEO బుచ్చయ్య గారు,AMO ఆజాద్ గారు PDG Ln.Dr. రాజేందర్ రెడ్డి గారుpmjf, District GLT కోఆర్డినేటర్ లయన్ డాక్టర్ వేలూరు శారద గారు mjf,COll GAT Ln.Dr.P. కిరణ్ కుమార్ గారు, జోన్ చైర్ పర్సన్ లయన్ వజినపల్లి దీప గారు, డిస్టిక్ క్యాబినెట్ మెంబర్ లయన్ V. శైలజ గారుmjf, సెక్రెటరీ లయన్ కూన పద్మావతి గారు, Zone.1 చైర్మెన్ Ln.CH. నవీన్ గారు, Ln. Dr.యాదగిరి రెడ్డి గారు,తొర్రూర్ క్లబ్ ప్రెసిడెంట్ Ln.Dr.రామ నరసయ్య గారు, లయన్ రవీందర్ రెడ్డి గారు, లయన్ శ్రీనివాస్ గారు, లయన్ శంకర్ గారు, లయన్ రేణుక గారు,లయన్ ఉమా రెడ్డి గారు, లయన్ రజని గారు, లయన్ సబిత గారు, లయన్ విమల గారు పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

10
279 views