logo

నేడు బాలబాలికలకు యోగ పోటీలు

తొర్రూరు జూన్ 3 (AIMEDIA) 11వ ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా వీడు బాలబాలికలకు యోగ పోటీలు నిర్వహించనున్నట్లు మహబూబాబాద్ జిల్లా ఆయుష్ ఇంచార్జ్, తోర్రూరు ఆయుర్వేద వైద్యశాల సీనియర్ వైద్యాధికారి డాక్టర్ పి కిరణ్ కుమార్ జిల్లా కార్యక్రమాల అధికారి బి శ్రవణ్ కుమార్ తెలిపారు 11 యోగ దినోత్సవం పురస్కరించుకొని నిర్దేశించిన దినవారి ప్రణాళిక లో భాగంగా మంగళవారం రోజున స్థానిక యతి రాజారావు పార్కులో యోగా వాక్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద సీనియర్ వైద్యాధికారి డాక్టర్ పి కిరణ్ కుమార్ తో పాటు యోగ శిక్షకులు మురళీకృష్ణ స్పందన మరియు ఇతర ప్రముఖులు ప్రజలు స్థానికులు పాల్గొన్నారు. నేడు బుధవారం అన్నారం రోడ్డు కు గల వందేమాతరం ఫౌండేషన్ ప్రాంగణంలో ఐదు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల మధ్య వయసు గల బాల బాలికలకు యోగా పోటీలు నిర్వహించబడునని ఈ పోటీలలో విజేతలైన వారికి 21వ తేదీ రోజున ఘనంగా జరిగే 11వ ప్రపంచ యోగా దినోత్సవం వేడుకలలో బహుమతి ప్రధానం చేస్తామన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని బాలబాలికలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ, మంగళవారం నిర్వహించిన యోగ నడకకి స్పందన బాగా లభించిందని అన్నారు.

1
57 views