logo

మ్యాట్రిక్స్ హాస్పిటల్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన ఈ హెల్త్ క్యాంప్‌ను ముఖ్య అతిథిగా ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు, తన సోదరుడు మరియు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే అయిన దివంగత నేత బండారి రాజిరెడ్డి గారి ఆశయాల సాధనకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

మ్యాట్రిక్స్ హాస్పిటల్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
- నేతాజీ నగర్ కమ్యూనిటీ హాల్, రామంతాపూర్‌లో మెగా హెల్త్ క్యాంప్

రామంతాపూర్ డివిజన్‌లోని నేతాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో మ్యాట్రిక్స్ హాస్పిటల్, రామంతాపూర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌కు స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో వందలాది మంది ఆరోగ్య పరీక్షలు చేయించుకొని, వైద్య సలహాలు పొందారు.

దివంగత బండారి రాజిరెడ్డి గారి ఆశయ సాధనకు కృషి చేస్తాను
- ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు

ఈ హెల్త్ క్యాంప్‌ను ముఖ్య అతిథిగా ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు, తన సోదరుడు మరియు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే అయిన దివంగత నేత బండారి రాజిరెడ్డి గారి ఆశయాల సాధనకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మానవుడు ఆరోగ్యంగా ఉంటేనే అన్ని సాధించగలడని, అందుకే ప్రతి ఒక్కరూ మంచి ఆహారం తీసుకుని, నిత్యం వాకింగ్ చేయడం మరియు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మ్యాట్రిక్స్ హాస్పిటల్ (రామంతపూర్) మేనేజింగ్ డైరెక్టర్ డా. శ్రీనివాస్ చక్రవర్తి, మేనేజింగ్ డైరెక్టర్ డా. బి. శ్రీనివాస్ రావు, డా. కె. సుధీర్, డా. వి. ప్రదీప్ కుమార్ (మార్కెటింగ్ హెడ్), వేణు మాధవ్, మనోజ్, హాస్పిటల్ నర్సింగ్ సిబ్బంది, మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ గారు, BRS పార్టీ రాష్ట్ర నాయకులు గంధం నాగేశ్వర్ రావు, బాబు యాదవ్, బోసానీ పవన్ కుమార్, చాంద్ పాషా, నరేష్ తదితర BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

8
1213 views