logo

తొర్రురులో ఉచిత వైద్య శిబిరం – జూన్ 1న వైద్య సేవల మేళా.. అజరా హాస్పిటల్స్ , హెచ్.ఆర్ జే.ఆర్ ట్రస్ట్ సౌజన్యంతో.

తొర్రూరు మే 30(AIMEDIA) ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, హెచ్.ఆర్ జే.ఆర్ ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ అజరా హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీన తొర్రురులో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు. ట్రస్ట్ ఫౌండర్ ఛైర్‌పర్సన్ హనుమాండ్ల ఝాన్సి రాజేందర్ రెడ్డి వెల్లడించారు శుక్రవారం తొర్రురు పార్టీ కార్యాల యంలో .. మాట్లాడుతూ
ఈ వైద్య శిబిరం జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించబడుతుందని, శిబిరంలో అనేక విభాగాల్లో ప్రముఖ వైద్యులు తమ సేవలు అందించనున్నారని చెప్పారు. ముఖ్యంగా జనరల్ మెడిసిన్, షుగర్, బీపీ, ఈసీజీ, థైరాయి డ్, గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరీక్షలు, పిల్లల వైద్యం, కంటి పరీక్షలు, ఉచిత కళ్లద్దాల పంపిణీ, చర్మ మరియు నరాల సంబంధిత వైద్యం, క్యాన్సర్ స్క్రీనింగ్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని. అవసరమైన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేస్తారని తెలిపారుఈ శిబిరాన్ని పాలకుర్తి శాసనసభ్యులు శయశస్విని రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తా రని తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని నిర్వాహకులు కోరారు.

6
377 views