logo

దేశపాత్రునిపాలెం రామాలయంలో విశేష పూజా కార్యక్రమాలు

విజయనగరం
కొత్తవలస
దేశపాత్రునిపాలెం
స్పెషల్ న్యూస్

దేశపాత్రునిపాలెం రామాలయాన్ని పునర్నిర్మాణం చేసి ప్రతిరోజు విశేష కార్యక్రమాలతో దేవాలయ అర్చకులు భక్తుల్ని ఆకట్టుకోవడం జరుగుతున్నది.దీనికి తోడు కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు కూడా దేవాలయాల్లో విశేష కార్యక్రమాల్ని ప్రోత్సహించడం జరుగుచున్నది.అందులో భాగంగా మొన్న అమ్మవారికి కుంకుమార్చనలను ఘనంగా వైభవంగా కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు నిర్వహించడం జరిగింది. అదే కాక ప్రతినిత్యం ఉదయం మరియు సాయంత్రం అర్చన సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామంలో రామాలయాన్ని ఉన్నత స్థానానికి తేవాలని అటు కమిటీ ఇటు గ్రామ ప్రజలు కోరుకుంటూ మొన్న జరిగిన కుంకుమార్చన కార్యక్రమానికి విశేషంగా మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రధాన అర్చకులు అయిన నంది అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ రాజేష్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అని కమిటీ సభ్యులు తెలియజేయడం జరిగింది

6
3237 views