logo
logo
(Trust Registration No. 393)
aima profilepic
ELURU VENKATA RAMANA(RAJESH KUMAR SHARMA)
All India Media Association

AIMA
విజయనగరం జిల్లా
కొత్తవలస

స్కూటీ డిక్కీలో రూ.ఆరు లక్షల మాయం

కొత్తవలస:స్కూటీ డిక్కీలో ఉంచిన రూ. 8 లక్షలు మాయమయ్యాయి. బాధితుడు, పోలీసుల కథనం మేరకు.లక్కవరపుకోట మండలంలోని దాసుళ్లపాలెం గ్రామానికి వెళ్లే రహదారిలో నివాసముంటున్న వెలివెల రామకృష్ణ భవాని శర్మ కొత్తవలసలోని జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ బ్రాంచ్ లాకర్ ఉంది. సోమవారం మధ్యాహ్నం లాకర్లోని ఎనిమిది లక్షలు తీసుకుని లక్ష రూపాయలను బ్యాంక్లో డిపాజిట్ చేసి మిగిలిన సొమ్మును స్కూటీ డిక్కీలో పెట్టాడు. విశాఖ రహదారిలోని దుర్గా దేవి ఆలయం ముందు స్కూటీ ఉంచాడు. ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న తమ్ముడు శ్రీనివాసరావుకు మరో లక్ష రూపాయలను ఇవ్వడానికి డిక్కీలో నుంచి తీశాడు.ఆలయంలోకి డబ్బులు పట్టుకొనివెళ్లి శ్రీనివాసరావుకు ఇచ్చిన 10 నిమిషాల తరువాత వచ్చి డిక్కీ తెరచి చూశాడు. మిగిలిన ఆరు లక్షల రూపాయలు కని పించలేదు. దీంతో సోమవారం డబ్బులు పోయిన వెంటనే బాధితుడు రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు సీఐ బాల సూర్యారావు కేసు నమోదు చేశారు. బాధితుడ్ని మొదటి నుంచి ఎవరో అజ్ఞాతవ్యక్తి అనుసరించి చోరీకి పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన విజయనగరంలోని ఇంటికి సంబంధించి అడ్వాన్స్ ఇచ్చిన సొమ్మును బ్యాంక్ లాకర్లో దాచుకున్నట్లు బాధితుడు తెలిపాడు. అప్పులు తీర్చడంకోసం లాకర్లో ఉన్న సొమ్మును తీసినట్లు చెప్పాడు. చోరీ విషయమై విజయనగరం సీసీఎస్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంగళవారం వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు.

..........
14
647 views    0 comment
1 Shares

0
0 views    0 comment
0 Shares

0
0 views    0 comment
0 Shares

12
2960 views    0 comment
0 Shares

1
547 views    0 comment
0 Shares

2
551 views    0 comment
1 Shares

AIMA
BIG BREAKING NEWS
వైజాగ్ రిపోర్టర్

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిచినప్పటికీ డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా నిలిపివేసిన రిటర్నింగ్ అధికారి

కౌంటింగ్ కేంద్రం వద్ద ధర్నా చేస్తున్న టీడీపీ నేతలు కార్యకర్తలు.

భారీగా మోహరించిన పోలీసులు.

టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఎన్నికల్లో గెలుపొందినట్లు సంబంధిత రిటర్నింగ్ అధికారి రెండు గంటల క్రితమే ప్రకటించారు.

సిఎం నుంచి, ఆయన కార్యాలయం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ఇప్పుడు డిక్లరేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా జాప్యం.

ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి నిబంధనల ప్రకారం వెంటనే డిక్లరేషన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది.

సర్టిఫికెట్ ఇవ్వకుండా జాప్యం చేస్తుండటం తో కౌంటింగ్ కేంద్రం వద్ద నిరసన తెలుపుతున్న తెలుగు దేశం పార్టీనాయకులు కార్యకర్తలు.

..........
1
0 views    0 comment
0 Shares

AIMA
VIZAG
పెందుర్తి
రిపోర్టింగ్ రాజేష్ కుమార్ శర్మ
భక్తి న్యూస్

శ్రీశ్రీశ్రీ సూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవములు పెందుర్తి.1979 నుండి అమ్మవారికి పూజా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నవి ఈ దేవాలయం.

పెందుర్తి, 96 వార్డు,
విశాఖపట్నం జిల్లా
రిపోర్టింగ్ రాజేష్ కుమార్ శర్మ.


యాంకర్
శ్రీశ్రీశ్రీ సూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవములు పెందుర్తి


వాయిస్.
పెందుర్తి భక్తుల పాలిట కల్పవల్లి, శ్రీశ్రీశ్రీ సూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవములు పెందుర్తి గ్రామంలో తేదీ 21-03-2023 మంగళవారం ఉ॥ 5:00 గంటల నుండి నాధస్సుత శుభోదయంతో ప్రారంభమై అత్యంత ఆనందదాయకంగా కనులవిందైన కాంతి కిరణాలవెలుగులతో, అగ్ని గుండాల, సూరాలు, కోయ కోలటాలు, నేల డ్యాన్సులతో చల్లనితల్లి కరుణామృతవల్లి అయిన శ్రీ శ్రీ శ్రీ నూకాంబికా అమ్మవారి జాతర అతి వైభవంగా జరగబోతున్నది. కావున భక్తజనం పాల్గొని తీర్ధ ప్రసాదములు గైకొని అమ్మవారి కరుణకు పాత్రులు కాగలరని కోరుచున్నాము:

కార్యక్రమములు:
భారీ మందుగుండ అమ్మవారి పండుగ కడు రమ్యముగా జరుగును.చోడవరం వారిచే కోలాటం. S.V.L. ఈవెంట్స్ & స్టాండ్.డాన్స్ లేట్ డాన్స్ & డూప్ ఐటమ్ సాంగ్స్ మరియు పెందుర్తి, రాతి చెరువు వారిచేయ S.P.L. కంటెంట్ & సౌండ్ * డాన్స్ బేబీ డాన్స్ & డూప్స్.వారణాసి నుండి హరిచ్చంద్ర నాటకాలు.గుడి అలంకరణ. లైటింగ్ రామా లైటింగ్స్.

20-04-2023
గురువారం నాడు
అమ్మవారి నెల పండుగ
జరుపబడును

గ్రామ పెద్దలు, ప్రజలు
మరియు
వర్తక సంఘo

..........
20
30 views    0 comment
0 Shares

AIMA
VIZAG


11, 12 తేదీల్లో వేద విద్యా సమ్మేళనం.


శంకరమఠంలో ఈ నెల 11, 12 తేదీల్లో 23వ వేద విద్యా సమ్మేళనం నిర్వహిస్తు న్నట్లు ఉత్తరాంధ్ర వేద విద్యా ట్రస్ట్ కార్యదర్శి కంభంపాటి భాస్కరరావు తెలిపారు. శంకరమ ఠంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కంచికామ కోటి పీఠాధిపతి శం కర విజయేంద్ర సరస్వతి ఆశీస్సులతో జరుగు తున్న ఈ వేద విద్యా సమ్మేళనంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 100 మంది వేద పండితులు, 120 మంది వేద విద్యార్థులు పాల్గొంటున్నట్లు చెప్పారు. అన్ని వేదాలు, వివిధ విభాగాల్లో పరీ క్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ప్రదానం చేస్తామని వెల్లడించారు. శంకరమఠం అధ్యక్షుడు డాక్టర్ రవిరాజు ముఖ్య అతిథిగా, శంకరమఠం ముఖ్య సలహాదారులు, సీనియర్ న్యాయవాది కె.వి. రామ్మూర్తి, స్ప్రింట్ ఎక్స్పోర్ట్స్ ఎండీ గుంటూరు పవన్కుమార్ అతిథులుగా పాల్గొంటారని పేర్కొన్నారు.


ఈ వార్తల్ని చూసినవారు గానీ మరియు మీ స్నేహితుడు గాని మీ బంధువులు కానీ పుట్టినరోజులు గాని కార్యక్రమాలు గాని యాడ్ ఇవ్వడం జరుగుతుంది. మా ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ తరపు నుంచి ప్రచారమాధ్యమాల్లో వేయడం జరుగుతాయి మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 9618688312/9010243952

..........
17
2020 views    0 comment
0 Shares

AIMA
వైజాగ్


హెడ్లైన్
మహిళల కోసం ఎల్ఐసీలో సూపర్ ప్లాన్ రూ.4 లక్షలు రిటర్న్స్ పొందే ఛాన్స్.


న్యూస్:
ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసి ఎన్నో పథకాలను అందిస్తుంది.ఇప్పుడు మహిళా దినోత్సవ సందర్బంగా ఇప్పుడు మహిళలకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.మహిళల కోసం ప్రభుత్వం అనేక పథకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే.మహిళల కోసం ప్రత్యేకంగా ఓ ఎల్ఐసీ పాలసీ అందిస్తోంది. ఎల్ఐసీ ఆధార్ శిల పేరుతో ఈ పాలసీ అందుబాటులో ఉంది. ఇది నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, సేవింగ్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పథకం. కేవలం మహిళలు మాత్రమే ఈ పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది.మహిళలకు సేవింగ్స్‌తో పాటు రక్షణ కూడా అందించడం ఈ పాలసీ స్పెషల్.ఈ పాలసీ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఇది మహిళల కోసమే అయినా కూడా బాలికలు కూడా ఈ పథకాన్ని తీసుకోవచ్చు.ఈ పాలసీ తీసుకోవాలంటే 8 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు 55 ఏళ్లు. పాలసీ టర్మ్ కనీసం 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లు. సమ్ అష్యూర్డ్ విషయానికి వస్తే కనీసం రూ.2,00,000 నుంచి గరిష్టంగా రూ.5,00,000 వరకు పాలసీ తీసుకోవచ్చు. ప్రీమియం నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి ఓసారి చెల్లించవచ్చు.మీకు ఇప్పుడు 30 ఏళ్ల వయస్సు ఉంటే రూ.3,00,000 సమ్ అష్యూర్డ్‌తో 20 ఏళ్ల టర్మ్ ఎంచుకొని ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీ తీసుకుంటే రోజూ రూ.30 చొప్పున ఏటా రూ.10,959 ప్రీమియం చెల్లించాలి. మెచ్యూరిటీ నాటికి రూ.3,97,000 రిటర్న్స్ వస్తాయి. చెల్లించిన ప్రీమియంతో పాటు బోనస్ కూడా వస్తుంది కాబట్టి మంచి రిటర్న్స్ వస్తాయి.అలాగే 35 ఏళ్ల వయస్సు ఉన్న ఓ మహిళ రూ.2,00,000 సమ్ అష్యూర్డ్‌తో 20 ఏళ్ల టర్మ్ ఎంచుకొని ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీ తీసుకున్నారనుకుందాం. రోజూ రూ.22 చొప్పున ఏటా రూ.7,860 ప్రీమియం చెల్లించాలి. మెచ్యూరిటీ నాటికి రూ.2,33,000 రిటర్న్స్ వస్తాయి.పాలసీ తీసుకున్న మహిళ పాలసీ కొనసాగుతున్న సమయంలో మరణిస్తే నామినీకి డబ్బులు చెల్లిస్తుంది ఎల్ఐసీ. పాలసీ తీసుకున్న ఐదేళ్ల లోపు మరణిస్తే సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ లభిస్తుంది. ఐదేళ్ల తర్వాత మరణిస్తే లాయల్టీ అడిషన్ కూడా లభిస్తుంది.రెండేళ్లు ప్రీమియంలు కరెక్ట్ గా చెల్లిస్తే లోన్ పొందే అవకాశాలున్నాయి అని విలేకరులకు
వై.సీతారాము గారు
సి.ఐ.ఎస్
కెరియర్ ఏజెంట్ 190803
చైర్మన్ క్లబ్ నెంబర్ గారు తెలియజేయడం జరిగింది.

..........
21
1260 views    0 comment
1 Shares

AIMA
VIZAG NEWS


🙏మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయతే నమః 🙏

శ్రీశ్రీశ్రీ పార్వతీ సహిత ఓంకారేశ్వర దేవాలయ పంచమ వార్షికోత్సవ, కళ్యాణ మహోత్సవాహ్వాన శుభపత్రిక.

చింతలపాలెం, సింహాద్రినగర్ లే అవుట్

శ్రీ గురునాథ స్వామివారి ఆశీస్సులతో

స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ ఏకాదశి శుక్రవారం అనగాతేది 3-3-2023 ఉదయం గం||6-30 ని||లకు సంకల్పం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, అగ్నిప్రతిష్ట, రుద్రాభిషేకము ఉదయం 10.00 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవము తదుపరి పూర్ణాహుతి జరుగును.

పై కార్యక్రమములు

బ్రహ్మశ్రీ చింతా సుబ్రహ్మణ్య అవధాని గారు, చింతా సీతారామయ్య శర్మ గారు మరియు వేదపండితుల ఆధ్వర్యమున జరుగును.

కావున యావన్మంది భక్తులు విచ్చేసి పై కార్యక్రమములలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి ఓంకారేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము.

ఇట్లు

ఆలయ ధర్మకర్త శ్రీ ఏలూరు సత్యనాగేశ్వరరావు

ఫోన్: 9440382333

..........
26
16939 views    0 comment
1 Shares

AIMA
VIZAG
BREAKING NEWS

సంస్కార భారతి విశాఖపట్నం మహా నగర్ శాఖ

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః (ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, నివసిస్తారు.)

వందే వనితా భారతం

GVMC పరిధిలోని 18 ఏళ్ల పైబడ్డ ప్రతి వనిత పాల్గొనవచ్చు .సంగీతం, సాహిత్యం, నృత్యం, ధ్వన్యనుకరణ, వాయులీనం, వీణ, వేణువు, తబలా, మృదంగం, స్థానిక నృత్యం, జానపద
నృత్యం /పాట,.... మొదలగు ఏదైనా "భారతీయ సాంప్రదాయక కళ"లో ప్రదర్శన ఇవ్వవచ్చు.
అంశం దేశభక్తి పూరితమై ఉండాలి.

నైపుణ్యం ఉన్న కళలో "ఒక వీడియో" మాత్రమే తీసి క్రింద
- ఇచ్చిన ఈమెయిల్ కి పంపాలి.

వీడియో మూడు నిమిషాలకు మించి ఉండకూడదు. వీడియో సైజ్ పెద్దది అయితే డ్రైవ్ లింక్ షేర్ చేయాలి

(లేదా వేరే విధానంలో కూడా పంపవచ్చు)ఎంపిక అయిన వారు కార్యక్రమంలో మీరు వీడియోలో పంపినదే తిరిగి ప్రదర్శించాలి.

(అప్పుడు సమయ నిడివిలో మార్పు ఉంటుంది) కార్యక్రమం వివరాలు(తేదీ, వేదిక..) తరువాత తెలియజేస్తాము. విజేతల్ని అక్కడే ప్రకటించడం జరుగుతుంది

పాల్గొన్న అందరికీ ప్రశంసా పత్రం (డిజిటల్) పంపబడును. తుది నిర్ణయం సంస్థదే. మీ పూర్తి పేరు, చిరునామా, వాట్సాప్ నంబరు తప్పనిసరిగా
వీడియో పంపిన మెయిల్ లోనే పంపాలి.

మీ వీడియోలు మాకు 2 మార్చి రాత్రి లోపు అందాలి .

ప్రవేశ రుసుము లేదు .

మెయిల్ samskarbharathivizag@gmail.com

వివరాలకు: 7032467045

..........
18
14642 views    0 comment
1 Shares

AIMA
VIZAG NEWS


అరకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా జె.కే.రత్నరాజు గారు.

శుభాకాంక్షలు తెలియజేసిన ఇతర ఇన్చార్జులు మరియు కార్యకర్తలు.

అల్లూరి సీతారామరాజు జిల్లా
అరకులోయ AIMA న్యూస్ ప్రతినిధి
16/ 02/2023 : అరకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా అరకులోయ అసోసియేషన్ సభ్యుడుగా జె.కె. రత్నరాజు గారు ని నియమించినట్లు అరకు నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ ఇంచార్జి మాజీ మంత్రి వర్యులు కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు. గురువారం ఫోన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ కి రత్నరాజు ఎన్నో ఏళ్ల నుండి సేవలను అందిస్తున్నారని, ఈ సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం ఆయనను అరకు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడి గా నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అరకు నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ జె.కె. రత్నరాజు గారు గుర్తించి అరకు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులుగా నియమించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇదిలా అరకులోయ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షతగా నియామకమైన రత్నరాజు గారు మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని చెప్పారు. టిడిపి బలోపేతానికి రేయిం బవల్లు కృషి చేస్తానని చెప్పారు. కాగా నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అభిమానులు రత్నం రాజుకు అభినందనలు తెలిపారు. ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర తరఫునుండి బ్రాహ్మణ సంక్షేమ వేదిక మరియు పురోహిత బ్రాహ్మణ సమైక్య అర్చకులు అతన్ని ఆశీర్వదించడం జరిగింది. వైజాగ్ మరియు విజయనగరం మరియు అరకు వ్యాలీ ఇన్చార్జ్ బ్రాహ్మణ ఇంచార్జ్ అండ్ సెక్రటరీ గారు ఏలూరి వెంకటరమణ మూర్తి గారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

..........
13
14645 views    0 comment
0 Shares

AIMA
VIZAG
NEWS

ఆచంట చలపతి రావు డాక్టర్ గారు బ్రాహ్మణ వైద్యుల ఆత్మీయ సమ్మేళనంలో అరుదైన ఘనత సాధించి గౌరవ సత్కారముతో వైజాగ్ నుండి దక్కించుకోవడం జరిగింది.

డాక్టర్ చలపతి రావు ఆచంట, MD DM గ్యాస్ట్రోఎంటరాలజీ, క్లినికల్ డైరెక్టర్, ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ
ఎంటరాలజీ, కిమ్స్ ఐకాన్ హాస్పిటల్, mvp కాలనీ మరియు షీలానగర్, వైజాగ్ అధునాతన ఎండోస్కోపిస్ట్, గ్యాస్ట్రిక్ సమస్యలు, ప్రేగు సమస్యలు, ప్యాంక్రియాస్ , కాలేయ సమస్యలు మరియు కాలేయ మార్పిడిలో నిపుణుడు ఇతను చేసిన సేవకు గాను ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర గుర్తించి వారికి బ్రాహ్మణ సంక్షేమ వేదిక తరపు నుండి శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో బ్రాహ్మణ వైద్యుల ఆత్మీయ సమ్మేళనంలో వీరికి గౌరవ సత్కారముతో సత్కరించబడడం.

..........
4
14640 views    0 comment
2 Shares

బ్రాహ్మణ సంక్షేమ వేదిక ప్రాంతీయ ఇన్చార్జిల నియామకం

AIMA, (హైదరాబాద్/విశాఖపట్నం): పురోహిత మిత్ర ఉత్తరాంధ్ర గ్రూప్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక ప్రాంతీయ ఇన్ చార్జీలను నియమించారు. ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర గ్రూప్ అధ్యక్షుడు ఏలూరు వెంకటరమణ మూర్తి శర్మ(రాజేష్ కుమార్ శర్మ)కు ప్రోత్సాహం అందించి సహాయపడిన వారిని ప్రాంతాల వారీగా ఇన్చార్జీలుగా నియమించారు. బ్రాహ్మణ సంక్షేమ వేదికకు ఈసారి శ్రీకాకుళం, విజయనగరం నుంచి పెంటా అశోక్ శర్మ, సంబర శ్రీరామ సూర్యప్రకాశ్ శర్మలను ఇన్చార్జిలుగా నియమించినట్టు ప్రతినిధులు తెలిపారు. అదేవిధంగా విశాఖ జిల్లాలో తొమ్మిది మందిని ఇన్ చార్జిగా నియమించినట్టు చెప్పారు. పి.లక్ష్మి ఉదయ, భాగవతుల లక్ష్మణ్ కుమార్, డి.వెంకటేశ్వర్లు, కొలచల వెంకటలక్ష్మి ప్రశాంతి, ఈ. సంతోషిణి, నూకల రమేష్, వి.స్పందన, భాస్కరభట్ల రవికుమార్, వాడ్రేవు ధనరాజ్ లు ఇన్చార్జి లుగా నియమితులయ్యారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక నియమక పత్రాలను హైదరాబాద్లోని శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో అందజేశారు.

మరిన్ని వార్తల విశ్లేషణ కోసం https://youtube.com/@elururajesh143 ను వీక్షించండి

..........
23
14640 views    0 comment
1 Shares

AIMA
పెందుర్తి
వైజాగ్


అనకాపల్లి, ఘనంగా రామునాయుడు జన్మదిన వేడుకలు

AIMA - పెందుర్తి: బీజేపీని ఇంటి పేరుగా చేసుకున్న ఆ పార్టీ పెందుర్తి నియోజకవర్గం ఇన్చార్జి గొర్లె రాము నాయుడు గారు జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. స్థానిక కళ్యాణ మండపంలో జరిగిన వేడుకల్లో ఆ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గండి వెంకట సత్యనారాయణ, స్టేట్ ప్రోటోకాల్ కమిషన్ కన్వీనర్ బాల రాజేశ్వరరావు, స్టేట్ కార్యవర్గ సభ్యులు రెడ్డి రామునాయుడు, వేపకుంట ప్రెసిడెంట్ ఆర్. జయరాజు, పెందుర్తి రూరల్ ప్రెసిడెంట్ సన్యాసిరావు, సబ్బవరం ప్రెసిడెంట్ జిఎస్ నాయుడు, స్కిల్ డెవలప్మెంట్ కన్వీనర్ నాదెళ్ల జ్యోతి, పార్టీ నాయుకులు శ్రీనివాస్, నాయుడు, రాజేష్ తదితర ప్రముఖులు రామునాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వేద పండితులు రాజేష్ శర్మ గారు బృందం ఆయనకు వేదాశీర్వాచనం అందజేశారు. స్థానిక లయోలా వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు, దుస్తులు అందజేశారు. తదుపరి మీడియా వారితో మాట్లాడుతూ పురోహిత బ్రాహ్మణ సమైక్య మరియు పురోహిత మిత్ర సభ్యులు అందరికీ నేను అండగా ఉంటానని ఏ సమస్య వచ్చినా ఏ సమయంలోనైనా నన్ను సంప్రదించవచ్చని ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తారని పురోహిత మిత్ర గ్రూప్ ఇన్చార్జ్ మరియు స్టేట్ ఇంచార్జ్ అయినటువంటి ఏలూరు వెంకటరమణమూర్తి(రాజేష్ శర్మ) గారికి సభాముఖంగా తెలియజేయడం జరిగింది.

..........
10
14643 views    0 comment
0 Shares

AIMA
VIZAG NEWS



శ్రీ కాంచీ కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకరాచార్య పాదారవిందములకు నమస్కారములు

8న వైదిక సదస్సు

సీతంపేట(విశాఖ ఉత్తర): శంకరమఠంలో ఈ

నెల 8వ తేదీన కంచి కామకోటి పీఠాధిపతి

శంకర విజయేంద్ర సరస్వతి పురోహిత, అర్చక వర్గ సభ్యులతో వైదిక సదస్సు నిర్వహించనున్నారు. విజయయాత్ర సంద ర్భంగా ఆయన శంకరమఠానికి ఇటీవల విచ్చేయగా.భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం సాయంత్రం 6 గంటలకు వైదిక సదస్సు నిర్వహిస్తున్నారని.. అర్చక, పురోహితులు స్వామి అనుగ్రహాన్ని పొందగ లరని శంకరమఠం ప్రతినిధులు ఓ ప్రకట నలో కోరారు. సదస్సులో పాల్గొనే వారు 94415 03935, 99898 93557లో సంప్రదిం చవచ్చ.

..........
25
14638 views    0 comment
1 Shares

20
16756 views    0 comment
1 Shares

AIMA
విజయనగరం
కొత్తవలస
మంగలపాలెం



కొత్తవలస మంగళ పాలెం అమ్మ అపార్ట్మెంట్ ఫేస్ 1 న్యూఇయర్ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది.



ఈ కార్యక్రమాలు 9 గంటల నుండి ప్రారంభం జరిగినవి అందులో భాగంగా సాంస్కృతిక మరియు నృత్య గీతాలు తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నూతనంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాత కమిటీ సభ్యులు అతిథులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని శంకర్ మరియు నిఖిలేష్ ఓం శర్మ జగన్నాధర గారు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా అందరూ కలిసి ఈ నూతన సంవత్సరాన్ని సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది.

..........
8
14638 views    0 comment
1 Shares

44
14648 views    0 comment
1 Shares

VIZAG
పెందుర్తి NEWS

శ్రీ కనకదుర్గ భక్తురాలు

ఎటువంటి సమస్యనైనా పరిష్కరించబడును సమయం: ప్రతి శుక్రవారం ఉ॥ 7 గం॥ ల నుండి మ॥ 3 గం ల వరక

తగరపువలసరోడ్డు, ప్రశాంతినగర్, దుర్గమ్మ గుడిదగ్గర, పెందుర్తి, విశాఖపట్టణం


సెల్: 91828562793 9493644716
భక్తురాలు కనకదుర్గ


శ్రీ కనకదుర్గ భక్తురాలు సాయి భవాని మరియు నాగు భవాని ఇతర ముఖ్య అతిథులు పీఠంలో నిన్న లక్ష్మీ గణపతి హోమం శాంతి హోమం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా భజన కార్యక్రమాలు అన్నసంతర్పణ కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది. 550 మంది భక్తులు విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని ఆ మహా ప్రసాదాన్ని స్వీకరించి ఇతర ప్రదేశాల నుంచి గురువులు కూడా వచ్చి ఆ పీఠాన్ని దర్శకు దర్శించుకుని కార్యక్రమాల్ని జయప్రదం చేయడం జరిగింది. సాయి భవాని భక్తులకు అందుబాటులో ఉండేటట్టు ఎల్లవేళలా తన ఇంటి వద్ద ఉన్న పీఠంలో అందుబాటులో ఉంటానని తెలియజేయడం జరిగింది.

..........
39
14637 views    0 comment
1 Shares

AIMA
బ్రేకింగ్ న్యూస్
ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర

అందరికీ విజ్ఞప్తి


04-12-2022న జిల్లా పరిషత్ హాల్లో ఉదయం10:30నీమీషాల నుంచి 2:00గంటల వరుకు ఉదయం స్నాక్స్ మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది, బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ అవగాహన సదస్సు మరియు రుణమేళా అక్కడే మన పోస్ట్మాన్ గారిని ఏర్పాటు చేసి పేర్లను నమోదు చేసుకోవడం జరుగుతుంది. అందరూ తప్పకుండా రండి పేరు నమోదు చేసుకోండి ఉచిత ఇన్సూరెన్స్ స్కీమును ఉపయోగించుకోండి అందరికీ తెలియజేయండి ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర గ్రూపులో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే దీని కిందని లింకు పంపిస్తాను ఆ లింకు ద్వారా అందరినీ జాయిన్ చేయండి ఈ అవకాశాన్ని అందరికీ కల్పించండి.


ఈ లింకును బ్రాహ్మణులు మాత్రమే ఉపయోగించుకోవలెను.
https://chat.whatsapp.com/FbE6QYWRUfsCHPkA6n2MO2


మన బ్రాహ్మణులు ఏ న్యూస్ అయినా కవర్ చేయడానికి మన ఆలిండియా మీడియా అసోసియేషన్ మీకు సహాయపడుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని ప్రమోషన్ చేయడానికి మా సహకారం చేస్తాం.

..........
27
14636 views    0 comment
0 Shares

AIMA
VIZAG
పెందుర్తి న్యూస్


శ్రీశ్రీశ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవాలయం సాధుమఠం (రాంపురం) :

స్వామి వారి కార్తీక మాస మహోత్సవములు పురోహిత మిత్ర ఆధ్వర్యంలో

స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీశుభకృత్స్నామ సం॥ర కార్తీకమాస బహుళ ఏకాదశి అనగా ఆదివారం తే 20-11-2022 దిన శ్రీశ్రీశ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం (సాధుమఠం) రాంపురం నందు లక్షబిల్వార్చన, మహారుద్రాభిషేకం అమ్మవారి సహస్ర కుంకుమ పూజ కార్యక్రమములు ఉదయం 7-00 గం|| నుండి జరిగినవి. తదుపరి మహా రుద్రాభిషేకం కార్యక్రమం అదే సమయంలో రుద్ర హోమం కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. సుమారుగా 20 మంది రుత్వికులు ఘనాపాఠి మరియు పురోహితులు పురోహితం కుటుంబ సభ్యులు మరియు ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

అదేరోజు మధ్యాహ్నం 12-00 గం॥ నుండి అన్నసమారాధన జరుగును.

పై కార్యక్రమాలు శ్రీ శ్రీ శ్రీ రాపర్తి నరేంద్రకుమార్ శర్మ (ఘనాపాఠి)గారు.మంగళపాలెం, బ్రహ్మశ్రీ వెలివెల శ్రీనివాసశర్మ, శ్రీ రామకృష్ణ భవాని శర్మగా. పవన్ కుమార్ శర్మ .భాస్కర్ శర్మ. కిరణ్ కుమార్ శర్మ .నర్సింగరావు గారు మరియు శివరాం గారు .భాస్కర రావు గారు. ఎంవిపి రమేష్ గారు. సొంటెం సంతోష్ గారు. మద్దిలపాలెం లక్ష్మీ గారు మరియు పురోహిత మిత్ర ముఖ్య సభ్యులు పాల్గొనడం జరిగింది

..........
0
14635 views    0 comment
0 Shares

AIMA
VIZAG
పెందుర్తి న్యూస్


శ్రీశ్రీశ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవాలయం సాధుమఠం (రాంపురం) :

స్వామి వారి కార్తీక మాస మహోత్సవములు పురోహిత మిత్ర ఆధ్వర్యంలో

స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీశుభకృత్స్నామ సం॥ర కార్తీకమాస బహుళ ఏకాదశి అనగా ఆదివారం తే 20-11-2022 దిన శ్రీశ్రీశ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం (సాధుమఠం) రాంపురం నందు లక్షబిల్వార్చన, మహారుద్రాభిషేకం అమ్మవారి సహస్ర కుంకుమ పూజ కార్యక్రమములు ఉదయం 7-00 గం|| నుండి జరిగినవి. తదుపరి మహా రుద్రాభిషేకం కార్యక్రమం అదే సమయంలో రుద్ర హోమం కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. సుమారుగా 20 మంది రుత్వికులు ఘనాపాఠి మరియు పురోహితులు పురోహితం కుటుంబ సభ్యులు మరియు ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

అదేరోజు మధ్యాహ్నం 12-00 గం॥ నుండి అన్నసమారాధన జరుగును.

పై కార్యక్రమాలు శ్రీ శ్రీ శ్రీ రాపర్తి నరేంద్రకుమార్ శర్మ (ఘనాపాఠి)గారు.మంగళపాలెం, బ్రహ్మశ్రీ వెలివెల శ్రీనివాసశర్మ, శ్రీ రామకృష్ణ భవాని శర్మగా. పవన్ కుమార్ శర్మ .భాస్కర్ శర్మ. కిరణ్ కుమార్ శర్మ .నర్సింగరావు గారు మరియు శివరాం గారు .భాస్కర రావు గారు. ఎంవిపి రమేష్ గారు. సొంటెం సంతోష్ గారు. మద్దిలపాలెం లక్ష్మీ గారు మరియు పురోహిత మిత్ర ముఖ్య సభ్యులు పాల్గొనడం జరిగింది

..........