logo

మాజీ మంత్రి ఎర్రబెల్లి హాయంలో అభివృద్ధి శూన్యం* *-కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్*

తొర్రూరు మే 3(AIMEDIA) బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాయంలో అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ పార్టీ తొర్రూరు పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అన్నారు.పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్ తో కలిసి సోమశేఖర్ మాట్లాడుతూ తొర్రూరు పట్టణంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పట్టణంలోని ఖమ్మం వరంగల్ హైవే రోడ్డుపై డివైడర్ ఏర్పాటు చేయడం జరిగిందని, మున్సిపాలిటీ భవనం, జూనియర్ సివిల్ కోర్టు, బాలికల గురుకుల పాఠశాల భవనాలను నిర్మించడం జరిగిందన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా ఉండి తొర్రూరు పట్టణంలో ఏ ఒక్క ప్రభుత్వ భవనాలను నిర్మించలేదని, అభివృద్ధి పనులకు కేవలం శంకుస్థాపనలు మాత్రమే చేసి వదిలేసారని అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సహకారంతో నిధులు కేటాయించి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేని బిఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, పెదగాని సోమయ్య,మంగళపల్లి రామచంద్రయ్య,జీనుగా సురేందర్ రెడ్డి,గుండాల నర్సయ్య, ధరావత్ సోమన్న,దొంగరి శంకర్,ఆలువాల సోమయ్య,ముద్దసాని సురేష్, బసనబోయిన రాజేష్, బసనబోయిన మహేష్,చిదిరాల రవి, ధరావత్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

0
46 views