logo

బ్రాహ్మణ నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త!

బ్రాహ్మణ నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త!

• ఉపాధి వ్యాపారం కోసం దరఖాస్తుకు 10 నుంచి ఓబిఎంఎంఎస్ పోర్టల్ అందుబాటులోకి

• ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి
ఇతర సంఘాల్లో అతి ముఖ్యమైన పదవుల్లో ఉన్న ఏలూరి వెంకటరమణ (రాజేష్ కుమార్ శర్మ)

• విశాఖపట్నం, ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్: రాష్ట్రంలోని బ్రాహ్మణ నిరుద్యోగ యువతీ, యువకులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు మంజూరు చేయటానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి
ఏలూరి వెంకటరమణ (రాజేష్ కుమార్ శర్మ) గురువారం మీడియాకు తెలియజేశారు. బ్రాహ్మణ సామాజికవర్గంలోని నిరుద్యోగ యువతి యువకులతో పాటు అర్చక, పురోహితులు కూడా obmms పోర్టల్ ద్వారా ఈనెల 10వ తేదీ నుంచి తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ పోర్టల్ను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ఈ పోర్టల్ లో తమ పేరు నమోదు చేసుకున్న తర్వాత అభ్యర్థులు నివాస ముండే ప్రాంతాల వారీగా వారి దరఖాస్తుల ను విడదీసి సంబంధిత మండల, మున్సిపల్ అధికారులకు పంపించడం జరుగుతుందన్నారు. ఈ దరఖాస్తులను అధికారులు దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలు వారు చేసే వ్యాపార తదితర అంశాలను పరిశీలించి సంబంధిత బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరుకు సిఫార్సు చేస్తారన్నారు. ఆయా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని రాజేష్ కుమార్ శర్మ గారు తెలియజేశారు. అందుచేత నిరుద్యోగ యువతీ యువకులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ దరఖాస్తులు చేసే విధానం, పూర్తి వివరాలకు పెందుర్తి తన కార్యాలయంలో తనను కలిసి సంప్రదించవచ్చని ఆయన సూచించారు. ఈనెల 10వతేదీ నుంచి ఈ పోర్టల్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. బ్రాహ్మణుల సదవకాశంగా భావించాలని ప్రతి ఒక్కరు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఇదివేదికగా ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులు "ఈడబ్ల్యూఎస్" సర్టిఫికెట్ కూడా సిద్ధం చేసుకోవాలని కోరారు. అవసరమైతే ఆ సర్టిఫికెట్ కూడా దరఖాస్తుతో జత చేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 9618688312 ఫోన్ నెంబర్ ని సంప్రదించవచ్చని, వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయవచ్చని ఏలూరి వెంకటరమణ (రాజేష్ కుమార్ శర్మ) తెలియజేశారు.

30
130 views