logo

బేగంపేట్ లో బీసీ జేఏసీ కోర్ కమిటీ సమావేశం.

హైదరాబాద్ : తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో
హైదరాబాద్ బేగంపేట్ లోని హోటల్ టూరిజం ప్లాజా లో జరిగిన బీసీ కమ్మిట్ కోర్ మీట్ కార్యక్రమలో బీసీ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. బీసీ జేఏసీ చీఫ్ కో ఆర్డినేటర్ గా సూదగాని హరిశంకర్ గౌడ్ ఎన్నికయ్యారు.

తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ

న్యూస్ పేపర్ లల్లో సగం పేజీ బీసీలది అయినప్పుడు రాజ్యాధికారం వస్తది. అందరిని కలుపుకొని పోవాలి. మండలిలో బీసీ ల గురించి మాట్లాసుతుంటే బీసీ సభ్యులు వెళ్లిపోయారు. ఓసి లు అభినందించారు. కానీ వాళ్ళ లోపల ఉండేది వేరు. జేయన్ టియు ప్రొఫెసర్ కు అన్యాయం జరిగింది వీసీ తో మాట్లాడితే ఫోన్ ఎత్తలే. ప్రసన్న హరికృష్ణ కు మద్దత్తు తెలిపితే సస్పెండ్ చేశారు. బీసీ ల కోసం కమిట్మెంట్ తో వచ్చిన నా పిల్లలమీద ఒట్టు. మనమీద ఉన్న ప్రేమ ఓటుగా మారినప్పుడే ఫలితం ఉంటుంది. ఉద్యమాన్ని నిలబెట్టాలంటే పరిక్కంప ను కూడా కౌగిలించుకోవడానికి సిద్ధం. స్టేట్ చీఫ్ కో ఆర్డినేటర్ అయిన సూదగాని హరిశంకర్ గౌడ్ తెల్లప్పుడూ టైమ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అందరు సిద్ధంగా ఉండాలి. తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ ఇదే ఫైనల్. బీసీ వీరుల నాయకుల చరిత్ర బయటకు తీయాలి. జిల్లాల కమిటీలు కూడా బలోపేతం చేయాలి. యూ ట్యూబ్ ఛానెల్ లకు వెళ్లి మాట్లాడండి. బీసీ వాదం బలపడాలి. మీడియాలో రోజు ఉండాలి. రేవంత్ రెడ్డి ఫోటో వేసి బీసీ రాజ్యాధికారం అని కొంతమంది సభ పెడుతున్నారు. అది మానుకోవాలి. సోషల్ మీడియాను విసతృతంగా వాడుకోవాలి. హరిశంకర్ గౌడ్ కు అందరు సహకరించాలి. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

కార్యక్రమంలో పంజాల జైహింద్ గౌడ్ నవ సంఘర్షణ సమితి అల్ ఇండియా చైర్మన్,వి. ప్రకాష్, వట్టె జానయ్య యాదవ్, సంగెం సూర్యారావు, మాజీ ఎమ్ బీసీ కమిషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ప్రజపతి, కొడెపాక కుమారస్వామి, తెలంగాణ విఠల్, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ భాగయ్య, పొఫెసర్ శ్రీనివాస్, పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్ సర్దార్ సర్వాయి పాపన్న సేన ప్రెసిడెంట్,ప్రొఫెసర్ వెంకట రాజయ్య, ప్రసన్న హరికృష్ణ,, తమ్మడబోయిన అర్జున్, సయ్యద్ రఫీ, చెన్నోజు రవి కిరణ్, పర్వతం వెంకటేశ్వర్లు, తిరుమని నాగరాజు, వేములవాడ మధన్ మోహన చారి, ఎల్లబోయిన ఓదెలు యాదవ్, సుతారపు రంగన్న, బంధారపు నర్సయ్య గౌడ్, సిద్ధగౌని సుదర్శన్, బడే సాబ్, మల్లిఖార్జున్, గోపి రజక, డాక్టర్ సాంబ శివ గౌడ్, బొడ్డుపల్లి చంద్రశేఖర్, రాఘవేంద్ర గౌడ్, రిటైర్డ్ డీఈఓ విజయ్ కుమార్,కోట్ల వాసుదేవ్, సింగారపు రవీందర్, బీ శంకర్ ఆరె కటిక, ప్రొఫెసర్ దేవల్ల సమ్మయ్య, శంకర్ పల్లి మధు, డీఎస్ చారి, భూసారపు శ్రీనివాస్, వడ్డేపల్లి మాధవ్ మేరు, వెంకటరమణ, నాగరాజు గౌడ్, వివిధ కుల సంఘాల నాయకులు, మేధావులు, తదితరులు పాల్గొన్నారు.

0
0 views