logo

మల్కాజ్గిరి పార్లమెంట్ బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిజెపి నేతలు మరియు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది.

హైదరాబాద్ :
తేదీ:20 - Mar-2025

ఈటెల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన లాస్య ఇన్ఫోటెక్ అధినేత ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మాజీమంత్రి సి కృష్ణయాదవ్, రామిడి వెంకట్ రెడ్డి

తెలంగాణ ఉద్యమనేత మరియు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అన్నివర్గాల ప్రజల కోసం అనునిత్యం కృషి చేస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం సభ్యుడు శ్రీ ఈటెల రాజేందర్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు బిజెపి నాయకులు శ్రీ రామిడి వెంకటరెడ్డి మరియు శ్రీ ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్ మెగా రక్తదాన శిబిరాన్నీ కొంపల్లిలోని ప్రముఖ విద్యాసంస్థ లాస్య ఇన్ఫోటెక్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మరియు బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకుడు శ్రీ సి కృష్ణయాదవ్ గారు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ రక్తదాన శిబిరంలో లాస్య ఇన్ఫోటెక్ విద్యార్థులు మహిళలు, యువకులు మరియు బిజెపి పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసారు.

ఈసందర్భంగా లాస్య ఇన్ఫోటెక్ చైర్మన్ ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్ చేపట్టిన ఈ రక్తదాన శిబిరాన్ని ముఖ్య అతిథులుగా వచ్చిన మాజీ మంత్రి సి కృష్ణయాదవ్ మరియు శ్రీ రామిడి వెంకటరెడ్డి అభినందించి రక్తదానం చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు.

0
0 views