
ప్రేక్షకులను ఆలోచింప చేస్తున్న నాటిక ప్రదర్శనలు
తొర్రూర్, మార్చి 13 (AIMAMEDIA)డివిజన్ కేంద్రం లో చైతన్య కళా సమాఖ్య ఆధ్వర్యంలో 13వ జాతీయ తెలుగు ఆహ్వానిత నాటిక పోటీలలో ప్రదర్శిస్తున్న నాటికలు ప్రేక్షకులను ఆలోచింప చేస్తున్నాయి. మంగళవారం రాత్రి, ప్రదర్శించిన నాటికలు మూల్యం, మా ఇంట్లో మహాభారతం (హాస్య నాటిక) నాటికలు మంచి సందేశాన్ని చ్చాయి. కళావేదిక పై బుధవారం రాత్రి కిడ్నాప్ నాటిక కన్న ప్రేమ విలువ చాటుతుంది. కన్నప్రేమ విలువ తెలియడం కోసం సొంత మనుమణ్ణి కిడ్నాప్ చేస్తారు. కోటేశ్వరరావు(ప్రతి నాయకుడు పాత్రదారి )తన కూతురు కుటుంబం లో అగ్గి రాజేస్తాడు. వారికి కనువిప్పు కలగడం కోసం మనుమణ్ణి తామే కిడ్నాప్ చేసినట్లు చెబుతాడు. కోట్లు పెట్టి కొందామన్నా కన్న ప్రేమ దొరకదని, కన్న వారిని కంటికి రెప్పలా కాపాడాలని సందేశం ఇచ్చారు. నటినటులు తమ నటనలో జీవించారు. రెండవ నాటిక ఖరీదైనా జైళ్లు పట్టణం లో అపార్ట్మెంట్ లు అని ప్రక్క ఇంట్లో వ్యక్తి చనిపోతే కనీసం పలకరింపు లు కూడా నోచుకోవని అంత్యక్రియలకు కూడా సొంత కుటుంబ రాని పరిస్థితి లో పల్లె నుండి వచ్చి అపార్ట్మెంట్ లో జీవనం సాగిస్తున్నవారే కొడుకు బిడ్డలని తన ఆస్తి ని కూడా వదిలి ఇల్లాలు వారితో పట్టణం వీడి పల్లెకు వెళుతుంది.. అధ్యంతం చక్కటి మానవత్వం చాటే కథనం తో నాటిక అబ్బుర పరిచి అలోచింప జేసింది. ఈ కార్యక్రమం లో అతిధులు సమాఖ్య అధ్యక్షులు మన్నూర్ ఉమా ప్రధాన కార్యదర్శి సుంకరనేని పినాకపాణి, కోశాధికారి గడల శ్రీనివాస్, పట్నం శెట్టి శ్రీశైలం, బుదారపు శ్రీనివాస్, జనార్దన్ రాజు ఇమ్మడి రాంబాబు, కృపాల్, పెరుమాళ్ళ రవి,దాతలు పాల్గొన్నారు