logo

స్వేచ్ఛ హద్దులు మీరితే అనర్ధమే!? విదేశీ సంస్కృతి వినాశానికి హేతువు భారతీయ సంస్కృతి గొప్పది అని తెలిపిన” స్వేచ్ఛ"నాటిక

తొర్రూర్ టౌన్ మార్చి 11(ఆంధ్రప్రభ) డివిజన్ కేంద్రం లో చైతన్య కళా సమైక్య ఆధ్వర్యంలో సోమవారం రాత్రి జాతీయస్థాయి 13వ తెలుగు ఆహ్వానిత నాటక పోటీలలో మొదటి రోజు స్వేచ్ఛ నాటిక ప్రదర్శించారు. ఈ నాటికలో పాత్రధారుల అభినయం ఎంతో ఉత్కంఠగా సాగింది. నాటిక రచన దర్శకత్వం ప్రేక్షకులను అబ్బురపరిచింది.
ఇతివృత్తం
ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ కలిగి ఉండటంలో తప్పులేదని,విదేశీ సంస్కృతికి అలవాటైన ఇల్లాలు భర్తను కుమారుని కాదని స్వేచ్ఛగా ప్రయివేట్ జీవితం గడపాలని ఆశిస్తుంది. ఈ నేపథ్యంలో కూతురు శ్వేత అమెరికాలో ఉన్నత చదువులకు వెళ్లడానికి లక్ష రూపాయల పైగా డబ్బులు అవసరం ఉండి తల్లి మహిని అడుగుతుంది.తల్లి నిరాకరించి శ్వేత స్వేచ్ఛను అడ్డుకుంటుంది. డబ్బుల అవసరం కోసం స్నేహితురాలి జ్యోతి సలహా మేరకు పార్కుకు వచ్చి అపరిచిత వ్యక్తిని పరిచయం చేసుకొని డబ్బులు ఆశతో దగ్గరవుతుంది. తల్లి మహేశ్వరి, కూతురు శ్వేత ను నిలదీస్తుంది ప్రైవేటు జీవితం గడుపుతున్న తల్లితో ఉన్న ప్రతి నాయకుడు(అవినాష్) ఇద్దరితో గడుపుతానని అనడంతో, తల్లి ప్రియుడితో ప్రతిఘటిస్తుంది.కథా గమనం.చివరి అంకంలో శ్వేతకు పరిచయమైన వ్యక్తి తన సోదరుడని తెలుసుకొని, తన తండ్రి ఎవరో తన గది లో ఉన్న ఫోటో ద్వార తెలుసుకుని తల్లిని నిలదీయడం తో పశ్చాతాపం చెంది కూతురు బాగుండాలని అనుకుని కొడుకు(మూర్తి) కూతురు (శ్వేత )కాళ్లపై పడి క్షమించమని వేడుకుంటుంది. మహి పాత్రధారి ప్రేక్షకులను ముగ్ధులను చేసింది. భారతీయ సంస్కృతి చాలా గొప్పదని విలువలతో కూడుకున్నదని,కుటుంబ విలువలు కోల్పోవద్దని సందేశాన్ని ఇస్తుంది.ఈ నాటిక రచన పరమాత్ముని శివరాం, దర్శకత్వం బి. ఎం. రెడ్డి, సంగీతం నాగరాజు, రంగాలంకరణ ఫణింద్ర.

9
2552 views