logo

రాష్ట్ర స్థాయి కబడ్డీ మరియు వాలీ బాల్ పోటీలు

విజయనగరం జిల్లా, జామి మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ ఈశ్వరమ్మ తల్లి,సింహాద్రి అప్పన్న శివరాత్రి తీర్థ మహోత్సవం సందర్భంగా అయ్యప్ప వారి  కల్లాలు, వవల రెడ్డి కల్లాల వారు నిర్వహించినటువంటి తీర్థ మహోత్సవంలో ఉదయం నుండి జామి గ్రామం మరియు సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పూజాది కార్యక్రమాలు నిర్వహించగా ,మధ్యాహ్నం
సుమారు ఐదు వేలమందికి అన్న సమారాధన కార్యక్రమంను అయ్యప్ప గారి  కల్లాలు,కొత్తల వారి కల్లాలు,వవల రెడ్డి కల్లాల వారు ఘనంగా నిర్వహించా రు,  అలాగే రాష్ట్ర స్థాయి  కబడ్డీ,వాలీబాల్
క్రీడా పోటీలు  నిర్వహించగా ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి 28జట్టులు కబడ్డీ పోటీల లోను,15జట్టులు వాలీబాల్ పోటీల లోను తలపడగా ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉత్కంఠ భరితంగా కొనసాగిన ఈ పోటీల లో  కబడ్డీ  లో వరుసగా ఏనుగుల పాలెం,కుమరాం,తాటితూరు,కొత్తవలస మొదటి నాలుగు స్థానా లను దక్కించుకోగా, వాలీబా ల్  లో మొదటి బహుమతి జామి ఏ.బి నగర్, ద్వితీయ బహుమతి జామి,తృతీయ బహుమతి జడ్డేటి వలస,వారు విజేతలుగా నిలిచారు.

ఈ యొక్క కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు బండారు పెదబాబు, మాజీ సైనికులు చలు మూరి జగన్, జాగరపు ఈశ్వరరావు, గంగిరెడ్డి ఎర్నినా యుడు చేతుల మీదగా సుమారు 50 వేల రూపాయల ప్రైజ్ మనీ రూపంలో బహుమతులను విజేతలకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో
జె.ఏర్ని నాయుడు , బి.చిన్నబాబు, కె.అంజి, కె. ఎర్ని బాబు, వాక అప్పారావు, జి.మహేశ్వరావు, సి.హెచ్.ఏర్నిబాబు, జి.కృష్ణ, వి.సత్యం, వి.రమణ, సి హెచ్. సత్యన్నారాయణ మరియు అయ్యప్ప వారి  కల్లాలు,వవల రెడ్డి వారి కల్లాల వారి సహకారంతో , ఏ.పీ.పాలిటెక్నికల్ స్పోర్ట్స్ బోర్డ్ పి.ఈ.టి సూర్యారావు, సామాజిక కార్యకర్త గాలి చైతన్యకుమార్ వారి పర్యవేక్షణలో గాడి. ఆనంద్ మరియు మధు తదితర సీనియర్  క్రీడాకారులు ఈ యొక్క క్రీడా పోటీలను నిర్వహించినారు. సుమారు పది సంవత్సరాల తర్వాత ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహించడం యువత చెడుదారులు పట్టకుండా యువతలో క్రీడా స్ఫూర్తిని, శారీరక దృఢత్వo పై ఆసక్తిని  పెంచుకునే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందంగా ఉందని స్థానికులు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

9
2000 views