logo

వైద్యం వికటించి బాలుడు మృతి చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల ధర్నా ఆసుపత్రి ముందు ధర్నా


తొర్రూరు ఫిబ్రవరి 5(AIMAMEDIA )పట్టణ కేంద్రంలోని బాలాజీ నర్సింగ్ హోమ్ (సరస్వతి హాస్పిటల్) లో బుధవారం వైద్యం వికటించి బాలుడు మృతి చెందిన సంఘటన జరిగింది కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలం లోని కంఠయపాలెం గ్రామానికి చెందిన దాసరోజు నాగరాణి రెండో కుమారుడు .సిద్ధార్ధ్ అనే బాలుడు మృతి చెందాడని చెప్పారు. ఇందుకు కారణం పెద్దలకు ఇచ్చే ఇంజక్షన్ ఇవ్వడం వలనే క్షణాలలో చనిపోయాడని రోదిస్తూ సభ్యులు చెప్పారు.మృతుడు దాసరోజు సిద్ధార్థ్ (13) రెండు రోజులుగా జలుబు,జ్వరంతో బాధపడుతుండగా తొర్రూర్ లోని బాలాజీ హాస్పిటల్ కి చికిత్స కోసం కుటుంబ సభ్యులు తీసుకురావడం తో సిద్దార్డ్ కు పరీక్షలు చేసి డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ వికటించటం తో 10నిమిషాలలో శ్వాస ఆడట్లేదంటూ కుటుంబ సభ్యుల ముందే విలవిలలాడుతూ ప్రాణాలు వదిలాడని తల్లి, నానమ్మ రోదిస్తూ తెలిపారు.సిద్ధార్థ్ కు న్యాయం చేయాలని హాస్పిటల్ ముందు డెడ్ బాడీతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన కు దిగారు.విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్ కు భారీగా చేరుకున్నారు. మృతుడు కు అన్న, తల్లి ఉన్నారు. తండ్రి కూడా లేడని తమకు న్యాయం చేయాలని కోరారు.

6
3393 views