ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహకార (సంగం )రంగం.....!
°°°°°°కొత్త "డీసీసీబి"లు°°°°°°
కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేసిన వాటికి13 మందిజిల్లా స్థాయి చేర్మెన్ పదవులు దక్కనున్నాయి ప్రతి జిల్లాకు 12 మంది డైరెక్టర్ పోస్టులు*వీటితో పాటుగా 150 మందికి పైగా రాజకీయ నిరుద్యోగులకు పదవులు లభించే అవకాశం..!
*రైతులకు మెరుగైన సేవలు అందించాలని
*సహకార రంగాన్ని బలోపేతం చేయనున్న.... అప్కాబ్
••••••••••••••••••••••••••••••••••••
చిత్తూరు జిల్లా నగరి [08-12-2024]
*గ్రామీణ ప్రాంతాల లో ఆర్ధిక వ్యవ్ధను బలోపేతం చేయడానికి పల్లె ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి వైపు నడిపించడంలోనూసహకార రంగానిది కీలక పాత్ర
*రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం వాటిపైన ఆధారపడిన వివిధ అనుబంధ రంగాలకు నిత్యం ప్రోత్సహించడం
నందు సహకార రంగం ప్రధాన భూమిక పోషిస్తూ వస్తుంది అంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ
ప్రణాళికను రూపొందిస్తూ ఉంది
*ఉమ్మడి రాష్ట్రం విభజన అయిన
తరువాత సహకార సంఘాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగానే ఈ కొత్తగా ఏర్పడిన 13జిల్లాలకు అదే తరహాలోనే చేయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది
*వీలైనంత త్వరలో కొత్తగా ఏర్పాటు అయిన 13జిల్లాల్లో సహకార రంగాన్ని విస్తరింప చేయాలని చూస్తుంది డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది
*13కొత్త జిల్లాలలో ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం1964 ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పరస్పర సహాయ సహకార సంఘాల చట్టం
1985 నిబంధనల ద్వారా సహకార శాఖ నియంత్రణ విధులను నిర్వహిస్తూ ఉంది అదే చట్టాన్ని అనుసరించివిస్తరింప చేసుకు నే
అవకాశం కూడా ఉంది
*ఈ రంగం ద్వారా రైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయ అలాగే సహకార సంఘం నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వం పథకాలు నాబార్డ్ వారి రి ఫైనాన్స్ సౌకర్యం చేసుకునే అవకాశం సహకార సంఘం ద్వారా ఉంటుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సహకార సంఘాలను మరింత బలోపేతం చేయడానికి[సహకార్ సే సంవృద్ది ] ఒక విప్లవాత్మకమైన మార్పును కూడా తీసుకువచ్చింది
*రాష్ట్రంలో 26జిల్లాల పరిధిలో 13జిల్లాలకు సంబంధించి డీసీసీబీలు అందుబాటులో ఉన్నాయి మిగతా 13జిల్లాలకు కూడా డిసిసిబి ఏర్పాటు చేస్తే 13బ్యాంకులకు చైర్మన్ తో పాటు వాటి పరిధిలోని జిల్లా కేంద్ర సహకార సంఘాలకు 12మంది డైరెక్టర్లు వరకు 150మందికి పదవులు లభించే అవకాశం ఉంది ఆయా జిల్లా పరిధిలోని రాజకీయ నిరుద్యోగులకు సెంట్రల్ బ్యాంక్ పదవులు దక్కనున్నాయి
*కొత్త జిల్లాలో కేంద్ర సహకార బ్యాంక్ సేవలు అందుబాటులోకి తీసుకు రావాలని అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వ పెద్దలను
కోరుతూ వస్తున్నారు కొత్త జిల్లాల్లో
కేంద్ర సహకార బ్యాంకు లు ఏర్పాటు
చేయడానికి సాంకేతిక పరమైన అంశాలు ను పరిగణలోకి తీసుకుని
ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంది