logo

డిసెంబర్ 7 నుంచి జరిగే గీతా జయంతి వేడుకల్లో పాల్గొనండి. విశాఖ వాసులకు అహోబల జీయర్ స్వామి వారి ఆహ్వానం

డిసెంబర్ 7 నుంచి జరిగే గీతా జయంతి వేడుకల్లో పాల్గొనండి. విశాఖ వాసులకు అహోబల జీయర్ స్వామి వారి ఆహ్వానం


విశాఖ పట్నం 24, నవంబర్ 2024 ( డి ఎన్ ఎస్) : డిసెంబర్ 7 నుంచి విశాఖ పట్నం లో ప్రముఖ ఆధ్యాత్మిక ఆచార్యులు త్రిదండి చిన్న జీయర్ స్వామివారు నిర్వహించే గీతా జయంతి వేడుకల్లో పాల్గొనవలసింది గా త్రిదండి అహోబల జీయర్ స్వామి ఆహ్వానిస్తున్నారు. ఆదివారం విశాఖ వచ్చిన ఆయన సీతమ్మధార లో గల వర్మ కాంప్లెక్స్ ( పాత ఈనాడు ప్రాంగణం ) లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 7 సంవత్సరాల తర్వాత చిన్న జీయర్ స్వామి విశాఖ ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారన్నారు. విద్యార్థులకు, ఉద్యోగులకు, మహిళలకు మంచి ఉజ్వల భవిష్యత్ రావాలి అనే సంకల్పంతో ఐదు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు. విశాఖ పరిధిలో పలు పాఠశాలల విద్యార్థులకు భగవద్గీత శ్లోకాలు నేర్పించి, వారితో డిసెంబర్ 11 న భగవద్గీత పారాయణ చేయించడం జరుగుతుందన్నారు. ఈ వేడుకల్లో ప్రతి రోజూ ఉదయం చిన్న జీయర్ స్వామి వారి ప్రవచనం, అనంతరం తీర్థ గోష్ఠి, సాయంత్రం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ, స్వామి వారి ప్రవచనం జరుగుతాయన్నారు.
ఈ కార్యక్రమాల్లో శ్రీరామ పాదుకా సేవ, సామూహిక పూజలు, నేత్ర విద్యాలయ విద్యార్థులచే సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని తెలియ చేశారు. ప్రతిరోజూ ఉదయం బాలభోగం ( అల్పాహారం ) , మధ్యాహ్నం తదీయారాధన. ఏర్పాటు చేశామన్నారు. ఈ వేడుకల్లో విశాఖ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనవలసింది గా అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర గ్రూపు సభ్యులు కూడా పాల్గొనడం జరుగుతున్నారని వ్యవస్థాపక అధ్యక్షులు రాజేష్ కుమార్ శర్మ గారు తెలియజేయడం జరిగింది.

0
195 views