logo

కార్తీక అన్న సమారాధన బాలభాను అర్చక సంఘం ఆనందపురం ఇవే కాక అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్న బాలబాను అర్చక సంఘం

AIMA
ఆనందపురం న్యూస్


విశాఖ జిల్లా ఆనందపురం మండలం నేల్తేరు గ్రామం అభయ ఆంజనేయ స్వామి దేవాలయం లో ఘనంగా అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.బాలభాను అర్చకసంఘం అధ్యక్షులు కామేశ్వర శర్మ అద్వర్యంలో అన్నసమారాధన జరిగింది.ఏటా కార్తీక మాసంలో బాలభాను అర్చక సంఘం ఆధ్వర్యంలో 45 దేవాలయాలలో అన్న సమారాధన కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపద్యంలో ఆదివారం స్థానిక అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో సుమారు వందమంది భక్తులకు ప్రసాద వితరణ చేశారు.కార్యక్రమంలో మిరియాల సంతోష్ కుమార్, కమిటీ సభ్యులు బంక సూర్యనారాయణ, పాండ్రంగి అప్పారావు, ఎంపిటిసి రౌతు శ్యామల,వెంకటరావు, కృష్ణం నాయుడు తదితరులు పాల్గొన్నారు

23
3601 views