లయన్స్ క్లబ్ కోశాధికారి
భోనగిరి శంకర్ జ్యోతిల వివాహ వార్షికోత్సవాన సేవకార్యక్రమాలు
తొర్రూర్ నవంబర్ 19(AIMAMEDIA) లయన్స్ క్లబ్ కోశాధికారి భోనగిరి శంకర్ జ్యోతిల వివాహ వార్షికోత్సవ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ తొరూరు వారి ఆధ్వర్యంలో మంగళవారం పట్టణం లో పలు సేవా కార్యక్రమంలు చేపట్టారు.లయన్ నవీన్ కుమార్ అధ్యక్షతన లయన్స్ క్లబ్ కోశాధికారి భోనగిరి శంకర్ జ్యోతిల వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఉదయం ఎనిమిది గంటలకుస్థానిక శ్రీ వేంకటేశ్వర ఆలయంలో నూతనంగా నిర్మిం చిన హాలుకు 15వేల రూపాయ ల విలువ గల పది ఫ్యాన్లనుబ హుకరించి,ఉదయం 9 గంటలకు సకల దేవతలకు నిలయమైన గోవులకు స్థానిక గోశాలలో 5వేల రూపాయల విలువగల ఒక ట్రాక్టర్ గడ్డిని వితరణ చేసారు.అనంతరం కుమ్మరి కుంట్ల ఉన్నత పాఠ శాలలో 8 వేల రూపాయల విలువ గల పోడియం ను విద్యార్థుల సమక్షంలో పాఠశాల ప్రధానోపాధ్యాయు లు వెంకట రాజయ్య కు లయన్స్ క్లబ్ ఆఫ్ తోరూర్ వారి చేత అందజేశారు. తదుపరి భారత మొదటి మహిళా ప్రధాని కి. శే ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా పాఠశాల విద్యార్థులకు చాక్లెట్లు బిస్కెట్లు అందించి వారి గొప్పతనాన్ని వివరించారు.అనంతరం డివిజన్ కేంద్రం లో మహబూబాబాద్ రోడ్డు కు ఉన్న హరి హర క్షేత్రం అయ్య ప్ప స్వామి దేవాలయం లో అయ్యప్ప స్వాములకు హారతి ఇచ్చి సుమారు 600 మందికి మధ్యాహ్నం (భిక్ష )అన్న ప్రసాదం ని వితరణ చేశారు.ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేసినందుకు వెంకటేశ్వర భక్తులు గోశాల అధ్యక్ష కార్యదర్శులు కుమ్మరి కుంట్ల పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆలయ కమిటీ నిర్వాహకులు దారం ప్రసాద్,అయ్యప్ప భక్తులు శంకర్ జ్యోతి లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లయన్ రమేష్ లయన్ సురేష్ లయన్ డాక్టర్ కుమారస్వామి లయన్ వజిన్ పల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు