logo

*అందరూ భక్తి భావం పెంపొందించుకోవాలి* -పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి* ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం

తొర్రూరు: నవంబర్ 15(AIMAMEDIA భక్తి భావం పెంపొందించుకోవాలని, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శుక్ర వారం పట్టణంలోని పరిహార క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప మాలధారులకు కమిటీ సభ్యుడు అన్నదాత చీదర వీరన్న సహకారంతో మహా అన్నదానం ప్రారంభించారు.తొర్రూరు డివిజన్ కేంద్రానికి చెందిన ప్రముఖ రియల్టర్ బొమ్మనబోయిన రాజేందర్ యాదవ్ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి ఆలయానికి గతంలో 672 గజాల భూమి విరాళంగా అందించారు. ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్ పత్రాలను శుక్రవారం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సమక్షంలో అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు రాజేందర్ ను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి రియల్టర్ రాజేందర్ ఐదున్నర గుంటల భూమిని ఇవ్వడం అభినందనీయమన్నారు.కార్తీక మాసంలో వచ్చే పున్నమి పరమ పవిత్రమైనదని, అచంచల, స్థిర భక్తి విలువను ప్రబోధిస్తుందన్నారు.
మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని తప్పనిసరిగా పెంపొందించు కోవాలన్నారు.దేవుళ్ళ ఆశీస్సులతో ఎలాంటి అడ్డంకులు లేకుండా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామ న్నారు. నూతన విశ్వాసం, సంకల్పంతో నియోజకవర్గ సమగ్రాభివృద్ధిని చేపడుతామని ఆకాంక్షించారు.నియోజకవర్గంలోని పాలకుర్తి దేవస్థానం, సన్నూరు వెంకటేశ్వర స్వామి దేవస్థానం, వల్మిడి సీతారామచంద్ర దేవస్థానాలను అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య,వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, ఏఎంసీ డైరెక్టర్ కందాడి అచ్చిరెడ్డి,కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి, తూనం శ్రావణ్ కుమార్,దొంగరి శంకర్, ముద్దసాని సురేష్,ఆలయ కమిటీ సభ్యులు దారం ప్రసాద్, బిజ్జాల వెంకటరమణ, వల్లపు మధు, చీదర వీరన్న, ఇమ్మడి రాంబాబు, బిజ్జాల శ్రీనివాస్అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

0
900 views