logo

మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు.



మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,

మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులపై విస్తృతమవుతున్న పోలీసు తనిఖీలు

మద్యం సేవించి పట్టుబడినతే రూ.10 వేలు జరిమానా లేదా జైలుశిక్ష విధిస్తున్న న్యాయ స్థానాలు

మద్యం సేవించి పట్టుబడిన 6గురికి రూ.60 వేలు జరిమానా విధించిన గజపతినగరం న్యాయం స్థానం

జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ నవంబరు 12న వాహనదారులను హెచ్చరించారు.

మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవ్వడం లేదా ఇతర వాహనాలను ఢీ కొట్టి ప్రమాదాలకు కారకులవుతున్నారని జిల్లా ఎస్పీ అన్నారు. ఇటువంటి వాహనదారులను కట్టడి చేసేందుకు ప్రతీ రోజూ నిర్వహిస్తున్న విజిబుల్ పోలీసింగులో ప్రత్యేకంగా డ్రైవ్ చేపడుతున్నామన్నారు. మద్యం సేవించి ప్రమాదాలకు కారకులవుతున్నారన్న విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న న్యాయ స్థానాలు కూడా మద్యం సేవించి పట్టుబడిన వాహనదారులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నాయన్నారు. గజపతినగరం సర్కిల్ ఇన్స్పెక్టరు జి.ఎ.వి.రమణ ఆధ్వర్యంలో నవంబరు 9, 10 తేదీల్లో గజపతినగరం, బొండపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 6గురిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసారు. పట్టుబడిన వారిలో గజపతినగరంలో ముగ్గురు (1) ఎస్.శంకరరావు, వయస్సు 27 సం||లు (2) సిహెచ్.వేణు, వయస్సు 26 సం||లు (3) ఆర్.మహేష్, వయస్సు 32 సం||లు, అదే విధంగా బొండపల్లిలో ముగ్గురు (4) టి.నారాయణ, వయస్సు 32సం||లు (5) జి.రామకృష్ణ, వయస్సు 37 సం||లు (6) డి.అప్పన్న, వయస్సు 46 సం||లు అను వారిని గజపతినగరం న్యాయస్థానం ముందు హాజరుపరచగా, గజపతినగరం జె.ఎఫ్.సి.ఎమ్ మెజిస్ట్రేట్ కుమారి బి.కనక మహాలక్ష్మి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున మొత్తం రూ. 60 వేలు జరిమానా విధించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.

మద్యం సేవించి పట్టుబడిన వాహనదారులకు గజపతినగరం సర్కిల్ పోలీసులు కౌన్సిలింగు నిర్వహించి, రహదారి ప్రమాదాలకు కారకులు కావద్దని, ప్రమాదాలకు గురి కావద్దని, తమపై ఆధారపడి జీవించే భార్య, పిల్లలు, ఇతర కుటుంబసభ్యుల గురించి ఆలోచించాలని కౌన్సిలింగు నిర్వహిస్తున్నారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.

0
0 views