logo

జీపీ వర్కర్ చరణ్ కు న్యాయం చేయాలి

తొర్రూర్ నవంబర్ 12(AIMAMEDIA )భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరు పాడు మండలంలోని చింతల తండాలో చరణ్ అనే మల్టీ పర్పస్ వర్కర్ విధి నిర్వహ ణలో ఉండగా 11 కె.వి కరెంట్ వైర్ షాప్ తగిలి మరణించడం జరిగిందని ఆ కుటుంబానికి తగు న్యాయం చేసి ఆదుకోవా లని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి రవి రాష్ట్ర ప్రభుత్వా న్ని కోరారు.మంగళవారం పట్టణం లో జరిగిన గ్రామపంచాయతీ వర్కర్స్ ముఖ్య కార్యకర్తల సమావేశాని కి ముఖ్యఅతిథిగా హాజరై రవి ప్రసంగించారు. చింతల తండా లో మరణించిన చరణ్ కు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి 10 లక్షలు ఇన్సూరెన్స్ ద్వారా సహాయం చేసి ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విధి నిర్వహణలో అనేకమంది గ్రామపంచాయతీ వర్కర్స్ సేవలందిస్తు తమ ప్రాణాలను కోల్పోతూన్నారని, వారిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గత ఐదు నెలల నుండి వేతనాలు ఇవ్వకపోయినా బాధ్యతగా సేవలందిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటు న్న గ్రామపంచాయతీ కార్మికుల సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలని ఆయన కోరారు.. ప్రతి కార్మికుడికి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని పని భారం తగ్గిస్తూ మల్టీపర్పస్ వర్కర్ జీ వో ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటింటి సర్వే కార్యక్రమంలో పాల్గొన్న గ్రామపంచాయతీ సిబ్బందికి పారితోషకం ఇవ్వాలన్నారు. అదే పని చేస్తున్న ఇతర అధికా రులకు మాత్రం పారితోషికం ఇస్తూ గ్రామపంచాయతీ వర్కర్స్ కి ఇవ్వకుండా వారిచే వెట్టిచాకిరి చేయించుకోవడం అన్యాయమని రవి తెలిపారు. ఈ కార్యక్రమం లోయూనియన్ జిల్లా అధ్యక్షులు పాడియా బీకు, మండల అధ్యక్షులు గుండాల సోమ నర్సయ్య, మండల కార్యదర్శి బుచ్చిలిం గం, కోశాధికారి తండా లింగ మూర్తి, మండల నాయకులు యాకయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు..

1
2395 views