logo

డీ ఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయటం లో జాప్యం తగదు




డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం తగదు.

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వివిధ రకాల కారణాల చేత డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల లో జాప్యం తగదని DYFI జిల్లా కన్వీనర్, సిహెచ్ .హరీష్ ప్రకటనలో తెలిపారు
.
ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ గత ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.గత ప్రభుత్వం ఒక్క డిఎస్సీ కూడా వదలకుండా నిరుద్యోగులను మోసం చేయడంతో నిరుద్యోగులు విసిగి వేసారి ఉద్యోగాల కోసం మార్పు కోరి రాష్ట్రంలోని నిరుద్యోగులు గంపగుత్తగా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించడంలో కీలక పాత్ర వహించారన్నారు.తదనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు డిఎస్సీ పై మొదటి సంతకం చేశారు కానీ గడిచిన నాలుగు నెలలు అవుతున్నా డిఎస్సీ నోటిఫికేషన్ రాలేదని.టెట్ అన్నారు తర్వాత ఫలితాల విడుదల అన్నారు అదిగో,ఇదిగో డిఎస్సీ నోటిఫికేషన్ అన్నారు, ఊరిస్తున్నారు కానీ ఇప్పటికీ నోటిఫికేషన్ రావడం లేదని
అన్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ కారణంగా మళ్ళీ నోటిఫికేషన్ విడుదల విషయం లో జాప్యం జరుగుతుందన్న భయాందోళన మొదలైందని.డిఎస్సీ నోటిఫికేషన్ కోసం సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లలో శిక్షణా తరగతులు తీసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం వీరి సమస్యను గుర్తించి డిఎస్సీ నోటిఫికేషన్ పై క్లారిటీ ఇచ్చి నోటిఫికేషన్ విడుదల విషయం
లో జాప్యం చేయకుండా విద్యా శాఖ మంత్రి లోకేష్ చూడాలని కోరుతున్నామని అన్నారు.

0
1072 views