logo

వర్షాలపట్ల ప్రజలు అప్రమత్తం ఉండాలి. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి


తొర్రూర్ సెప్టెంబర్ 1(AIMAMEDIA ) పాలకుర్తి నియోజకవర్గం లో పలు మండలాలో రెండు రోజులు గా కురుస్తున్న వర్షానికి దెబ్బతిన్న చెరువులను భాదితులను నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయా ప్రాంతాల్లో పర్యటించి భరోసా ఇచ్చారు. అధికారులు అప్రమత్తం గా ఉండాలని ఆదేశించారు. ప్రజలు అవసరం అయితే బయటకు రావాలని అన్నారు.కాగా మండలం లోని వెంకటపురం గ్రామానికి చెందిన నరసయ్య అనే వ్యక్తి తన అన్న గుండాల వెంకన్న తో కలిసి నిన్న సాయంత్రం చెరువులో చేపల వేటకు వెళ్లారు కాగా బయటికి రాకపోవడంతో అన్న వెంకన్న గ్రామంలో సమాచారం ఇవ్వడంతో గాలింపులు చేపట్టిన ఉదయం వరకు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు. తొర్రూరు మండలంలోని చీకటాయపాలెం గ్రామానికి నిలిచిపోయిన రాకపోకలు. తొర్రూరునుండి జిల్లా కేంద్రం మహబూబాబాద్ కి నిలిచిన రాకపోకలు. తొర్రూరు మండలం గుర్తూర్ ఈదులవాగు పొంగడంతో తొర్రూర్- నర్సంపేట కి మధ్య రాకపోకలు బంద్. గుర్తురు ఎస్సీ కాలనీలోకి ఉధృతంగా వస్తున్న వర్షపు నీరు..తోరూర్ మండలం సోమరపుకుంట తండా వెళ్లే దారి కోతకు గురి కావడం జరిగింది. తండాలోని పలువురు ఇండ్లలోకి నీరు ప్రవేశించింది. హరిపిరాల గ్రామం పెద్ద చెరువు ప్రమాద స్థితిలో ఉండగా గండి పెట్టే ప్రయత్నాల్లో ప్రజలు ఉన్నారు. రాకపోకలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో భయాందోళన చెందుతున్నారు.వెళ్లికట్ట చెరువు పూర్తిగా అలుగు పోస్తూంది. కోతకు గురయ్య ప్రమాదం ఉందని తెలిసింది.కొత్త కాలనీ పలువురు ఇండ్లకు నీరు చేరింది. అమ్మపురం చెరువు అలుగు పోస్తుండడంతో జీకే తండాకు రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి*
చింతలపల్లి కుంట ఉదృతంగా ఉండడంతో కుమ్మనపల్లి తండాకు రాకపోకలు నిలిచిపోయాయి తొర్రూర్ నుండి కంటపాలెం వెళ్లే లో లెవెల్ బ్రిడ్జి ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి కంట పొలం చెరువు అలుగు పోస్తుండడంతో గతంలో ఓ వ్యక్తి మృతి చెందగా అప్రమత్తమైన పోలీసులు గుర్తురు, కంటాయపాలెం గ్రామం రాకపోకలు నిలిపివేశారు.తోరూర్ మండలం కంటపాలెం గ్రామంలో కొండ కేతమ్మ ఇల్లు వర్షానికి కూలింది.మడిపెల్లి శివారు ఆకేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది.

2
1821 views