logo

పిల్లలకు ఆరోగ్య ప్రధాయిని స్వర్ణామృతపాషణ

తొర్రూర్ టౌన్ ఆగస్టు 31(AIMAMEDIA ) పిల్లలకు ఆరోగ్య ప్రధాయిని స్వర్ణామృతపాషణ అని జిల్లా వికాస తరంగిణి అధ్యక్షులు డాక్టర్ రాధకృష్ణ డాక్టర్ కే రాజేందర్ రెడ్డి అన్నారు. వికాస తరంగిణి తొర్రూర్ శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం లో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి ఆశీస్సులతో, తయారు చేయబడిన ఆయుర్వేద ఔషదం ను వరంగల్ వికాస తరంగిణి సహకారం తో ఈ ఔషదం ను చిన్నారుల కు ఉచితంగా పంపిణి చేశారు. ఈ సందర్బంగా వరంగల్ వికాస తరంగిణి భాద్యులు మాట్లాడుతూ 6 నెలల వయసు నుండి 16 సం ల పిల్లల కు ఈ ఔషదం ను 12 నెలల పాటు ప్రతి మాసం లో పుష్యమి నక్షత్రం ఉన్న రోజున తమ పిల్లలకు వేయించడం వలన పిల్లలలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చురుగ్గా ఉంటారని, ఆర్టీజన్ పిల్లలకు ఆరోగ్య ప్రధాయిని గా ఎక్కువ గా ఉపయోగం అవుతుందని, ఈ ఔషదంలోని దాతువులు రోగానిరోధక శక్తిని పెంచుతాయన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా భాధ్యు లు సుభాష్ రెడ్డి డాక్టర్ కే యాదగిరి రెడ్డి, డాక్టర్ పి కిరణ్ కుమార్, టీ రవీంద్ర,ఇమ్మడి రాంబాబు,చలువాది సత్యనారాయణ కృపాకర్ రాజు,వికాస తరంగిణి తొర్రూర్ కో ఆర్డినేటర్ కుందూరు గీతా రెడ్డి, మంజుల, రేణుక, అనురాధ,అనసూయ, పద్మ, విజయలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.ఈ ఔషదాన్ని సుమారు 100 మంది పిల్లలకు పంపిణి చేసారు.

18
3883 views