logo

బిజెపి కార్యవర్గ సమావేశం శంషాబాద్ లో.

హైదరాబాద్ : శంషాబాద్ లో జరిగిన భారతీయ జనతా పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్.

అతి తక్కువ కాలంలో నిరుద్యోగ యువత విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
కాంట్రాక్టర్లు, సర్పంచులు చేసిన పనులకు బిల్లులు ఇచ్చే అధికారం మాకు లేదు అని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు చేతులెత్తేస్తున్నారు.
ఆర్థికమంత్రి, ముఖ్యమంత్రి చెప్పాల్సిందే అంటున్నారు.
ప్రతి బిల్లుకి ఎనిమిది శాతం డబ్బులు ముందే చెల్లిస్తేనే బిల్లు విడుదల చేస్తామని బాజాప్త చెప్తున్నారు.
ఉద్యోగుల రిటైర్మెంట్ డబ్బులు కూడా లంచం ఇస్తే తప్ప వచ్చేలా లేవు.

ప్రతిబిల్లుకి డబ్బులు తీసుకునే నీచమైన, నికృష్టమైన సంస్కృతి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చింది.

ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల దగ్గర నుంచి కూడా RRR టాక్స్ వసూలు చేస్తున్నారు. అందుకే విద్యార్థుల నుంచి ఎక్కువ డబ్బులు యాజమాన్యాలు తీసుకునే దుస్థితి వచ్చింది.

బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ కోసం ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి 75 రూపాయలు తీసుకునేలాగా ఒప్పందం కుదుర్చుకొని ఆయన మనుషులు వసూలు చేస్తున్నారు.

తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం కంచే చేను మేసినట్లు వ్యవహరిస్తుంది.

జీవో నెంబర్ 58, 59ను అమలు చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు చేయడం లేదు.

30 ఏళ్లుగా నివాసం ఉంటున్న.. ఉప్పల్లోని భూములను వక్స్ భూములుగా ప్రకటించి వారినీ మనోవేదనకు గురిచేస్తున్నారు.

పీర్జాదిగూడలో ఎన్నో ఏళ్ల క్రితం కొనుక్కొని కట్టుకుంటున్న ఇళ్లను రాజకీయ కక్షతో రాత్రికి రాత్రే కూల్చివేశారు.

అధికారులు చట్టానికి, సిస్టంకు అనుగుణంగా పనిచేయాలి.

ఏడు నెలల కాలంలోనే అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్.

ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు.

వీరు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి రెండు లక్షల కోట్లు కావాలి అవి తెచ్చే సత్తా ఈ ప్రభుత్వానికి ఉన్నదా ?

భారతీయ జనతా పార్టీగా ఈ ప్రభుత్వంపై పేదల కోసం యుద్ధం చేస్తాము.

బిఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశం లేదు. కాంగ్రెస్ పట్ల విశ్వాసం లేదు. ఎప్పుడు ఎన్నికల్లో వచ్చినా గెలుపొందేది భారతీయ జనతా పార్టీనే ..

గ్రామ వార్డు మెంబర్ దగ్గర నుంచి అన్ని పదవులు గెలుచుకునే సత్తా బీజేపీకి మాత్రమే ఉంది.

నాయకులందరూ విరామం లేకుండా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి.

0
0 views