logo

పాత్రికేయుల సమస్యలను పరిష్కరించాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు వినతిపత్రం అందజేసిన ఏపీయూడబ్ల్యూజే

పాత్రికేయుల సమస్యలను పరిష్కరించాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఏపీయూడబ్ల్యూజే నంద్యాల జిల్లా కమిటీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఖండే శ్యామ్ సుందర్ లాల్, నంద్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మధుబాబు, ఉస్మాన్ భాష, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు చలంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పాత్రికేయులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలని,
పాత్రికేయులకు ఇళ్ళ స్థలాలిచ్చి జర్నలిస్ట్ కాలనీలు ఏర్పాటు చేయాలని, సీనియర్ పాత్రికేయులకు అర్హతను బట్టి గౌరవ వేతనం ఇవ్వాలని, పాత్రికేయులపై దాడులు జరగకుండా రక్షణ చట్టాన్ని తీసుకురావాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయులకు ప్రమాద భీమా మొత్తాన్ని పెంచాలని, ఉచిత వైద్య సదుపాయం కల్పించి, భీమా ప్రీమియాన్ని చెల్లించాలని కోరారు. నారా లోకేష్ మాట్లాడుతూ జర్నలిస్టులకు కావలసిన సదుపాయాల కోసం తమ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందని, ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పక వీటి అమలుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

2
178 views