logo

తెలంగాణను కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నిను నషం కనివాను. జిల్లాలోని ఆదివాసీ , గిరిజనుల అవస్థలు తీర్చేందుకు కొత్త కలెక్టరేట్‌ తోపాటు జిల్లాలో మెడికల్‌ కాలేజీ కట్టించిన ఘనత బిఆర్‌ఎస్‌ది పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఖమ్మం, మహబూబాబాద్‌ ఎంపి అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, మాలోత్‌ కవితను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. కొత్తగూడెం పట్టణంలో మంగళవారం సాయంత్రం రోడ్‌ షో కెసిఆర్

రాష్ట్రంలోని సిఎం రేవంత్‌ రెడ్డి కుట్రలు చేస్తున్నారని, అదే జరిగితే రాష్ట్రం ఎడారిగా మారుతందని, కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణ ఆస్తిత్వాన్ని కాపాడుతానని మాజీ సిఎం కెసిఆర్‌, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ అన్నారు. బిఆర్‌ఎస్‌ ఖమ్మం, మహబూబాబాద్‌ బిఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ కొత్తగూడెం పట్టణంలో మంగళవారం సాయంత్రం రోడ్‌ షో నిర్వహించారు. ఈసందర్భంగా సుపర్‌బజార్‌ సెంటర్‌లో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో మాజీ ఎంస కెసిఆర్‌ మాట్లాడుతూ పదేళ్ళ బిఆర్‌ఎస్‌ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని కేవలం నాగులు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బ్రస్టు పట్టించిందని విమర్శించారు. స్వరాష్ట్రంలో సుపరిపాల అందిచేందుకు నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం జిల్లాల సంఖ్య కుదించేందుకు చూస్తుందని, ఇదే జరిగేతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కనుమరుగు అవుతుంది.
ఏజెన్సీ జిల్లాలోని ఆవీవాసీ, గిరిజనుల అవస్థలు తీర్చేందుకు కొత్త కలెక్టరేట్‌ తోపాటు జిల్లాలో మెడికల్‌ కాలేజీ కట్టించిన ఘనత బిఆర్‌ఎస్‌ది అన్నారు. గిరిజన బిడ్డల బాగు కోసం లక్ష 50లకు పైగా ఎకరాలకు పోడు భూములకు పట్టాలకు పట్టాల ఇచ్చి, త్రి ఫేస్‌ ఫ్రీ కరెంటుతో పాటు రైతు బంధు ఇచ్చామని గుర్తు చేశారు. 11వందల గురుకులాలను ఏర్పాటు చేసి ఘనత మాదే . అనాలోచిత పాలనలో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేశామని, భాగ్యనగరం నడి బొడ్డున గిరిజన, ఆదివాసీ సంఘాలకు భవనాలు కట్టామని గుర్తు చేశారు. రైతలకు రైతు బందు, రుణమాఫీ చేయడం లేదని, కళ్యాణ లక్ష్మీ లబ్దిదారులకు తులం బంగారం ఇస్తామని చెప్పి నేటికీ అమలు చేయడం లేదన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతల మోటర్లకు మీటర్లు పెట్టాలని, సింగరేణి సంస్థను సైతం నిర్వీర్యం చేసేందుకు ఆస్ట్రేలీయాలోని ఆదానీకి సంస్థకు చెందిన బొగ్గును ఉత్పత్తి చేసుకోవాలని తమపై తీవ్రంగా ఒత్తిడి చేసిందని, కానీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని తేల్చి కేంద్రం మాట వినలేదనే ఈడీ, ఐటి, సిబిఐ దాడులకు పూనుకుందన్నారు. ఇటీవల నిర్వహించిన సభలో మొదీ మాట్లాడుతూ సిఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్ళు చేస్తున్నారంటూ సాక్షాత్తు చేప్పారని, కానీ ఇద్దరు ఒక్కటే అన్నారు. ఇదే నిజమైతే ఇప్పుడు ఎందుకు రాష్ట్రంలో ఈడి, ఐటి విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలనలో దివాలా దిశగా సింగరేణి సంస్థ పోతుందని, బిఆర్‌ఎస్‌ పదేళ్ళ పాలనలో సింగరేణి కార్మికులకు చరిత్రలోనే అత్యధిక బోన్‌లు, కార్మిక సంక్షేమాలు అమలు చేశామని గుర్తు చేశారు. మతాల మధ్య పంచాయితీ పెట్టి ఓట్లు దండుకోడమే బిజెపి లక్ష్యం అన్నారు.
బిజెపి, కాంగ్రెస్‌ది దుర్మార్గపు పాలన అంటూ ఆరోపించారు. తెగించి తెచ్చుకున్న తెలంగాణను కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నిను శ్రమిశువుంట అని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఖమ్మం, మహబూబాబాద్‌ ఎంపి అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, మాలోత్‌ కవితను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, మాలోత్‌ కవిత, మాజీ ఎమ్మెల్యేలు, వనామా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌, బిఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

0
1615 views