logo

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిందోచ్...

మీరు అక్షయ తృతీయ సందర్భంగా బంగారం(gold), వెండి(silver)ని కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతున్న పుత్తడి, వెండి రేట్లు ఈరోజు( ఏప్రిల్ 30, 2024న) కూడా తగ్గాయి.
మీరు అక్షయ తృతీయ సందర్భంగా బంగారం(gold), వెండి(silver)ని కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతున్న పుత్తడి, వెండి రేట్లు ఈరోజు( ఏప్రిల్ 30, 2024న) కూడా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ.72,590కి చేరింది. ఇది నిన్నటితో పోల్చితే 320 రూపాయలు తగ్గింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ.67,400గా ఉంది. ఇక ఏపీలోని గుంటూరులో కూడా ప్రస్తుతం ఇవే ధరలు ఉన్నాయి. మరోవైపు కిలో వెండి ధర రూ.83,900కి చేరుకుంది.
మెట్రో నగరాల్లో బంగారం, వెండి ధరలు

ఢిల్లీలో బంగారం ధర రూ. 72,750/10 గ్రాములు, వెండి ధర రూ. 83,900/1 కిలో

హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 72,590/10 గ్రాములు, వెండి ధర రూ. 87,400/1 కిలో

చెన్నైలో బంగారం ధర రూ. 73,530/10 గ్రాములు, వెండి ధర రూ. 87500/1 కిలో

ముంబైలో బంగారం ధర రూ. 72,600/10 గ్రాములు, వెండి ధర రూ. 84000/1 కిలో

కోల్‌కతాలో బంగారం ధర రూ. 72,600/10 గ్రాములు, వెండి ధర రూ. 84000/1 కిలో


గత 24 గంటల్లో వెండి ధర కూడా తగ్గింది. ఈ క్రమంలో ఏప్రిల్ 30, 2024న కిలో వెండి ధర ఢిల్లీలో రూ.83,900కు చేరింది. ఇది నిన్న రూ.84,000గా ఉండేది. వెండి ధర ఈరోజు 100 రూపాయలు మాత్రమే తగ్గింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.87,400కు చేరుకుంది.

గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుంది. అంతేకాదు GST, TCS, ఇతర ఛార్జీలు వీటిలో కలిగి ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక ఆభరణాల వ్యాపారిని సంప్రదించండి.

0
948 views