logo

AIMA VIZAG BIG BREAKING NEWS పురోహిత బ్రాహ్మణ క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ 16 నుంచి విశాఖ లో ఉత్తరాంధ్ర పురో

AIMA
VIZAG
BIG BREAKING NEWS


పురోహిత బ్రాహ్మణ క్రికెట్ టోర్నమెంట్

సెప్టెంబర్ 16 నుంచి విశాఖ లో ఉత్తరాంధ్ర పురోహిత క్రికెట్ టోర్నీ

విశాఖపట్నం, ఆగస్టు 14, 2023 (AIMA Online):* సెప్టెంబర్ 16, 17 తేదీల్లో విశాఖపట్నం వేదికగా ఉత్తరాంధ్ర పురోహిత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర ప్రెసిడెంట్ గారు ఏలూరు వెంకట రమణ ( రాజేష్ కుమార్ శర్మ) తెలియచేసారు. పోటీల వివరాలను సోమవారం డిఎన్ఎస్ మీడియా కు వివరించారు. నిరంతరం పౌరహిత్యం, వైదిక క్రియలతోను బిజీగా
ఉండే పురోహితులకు కొంత ఉల్లాసం కల్గించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. విశాఖపట్నం లోని ఆరిలోవ లో గల మైదానం లో రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో ఉత్తరాంధ్ర కు చెందిన ఆరు జిల్లాల నుంచి జట్లు పాల్గొంటున్నాయన్నారు. వీరితో పాటు విశాఖ పట్నం బ్రాహ్మణా పాత్రికీయ సంఘం నుంచి క్రీడాకారులు కూడా పాల్గొంటున్నారన్నారు. నిర్వాహక కమిటీ లో రాజేష్ కుమార్ శర్మ గారి, టీమ్ మెంబర్స్ అండ్ సెక్రటరీస్ ఇన్ చార్జెస్. సోమయాజులు విజయ్ కుమార్ శర్మ గారి. టీమ్ మెంబర్స్ నెమ్మలూరి శివ గణేష్ శర్మ గారి టీం మెంబెర్స్ తదితరులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ పోటీలకు మీడియా పార్టనర్ గా గరుడ టీవీ ఛానల్ మరియు ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్. మరియు డి.ఎన్ఎస్ మీడియా ఇతర పాత్రికేయులు వ్యవహరిస్తోందన్నారు. క్రీడాకారులు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు నెల రోజుల సమయం ఇవ్వడం జరిగిందన్నారు. సుమారు 100 మంది కి పైగా పురోహితులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. పూర్తి స్థాయి క్రికెట్ నిబంధనలతో జరిగే ఈ పోటీల్లో సమాజానికి ఉపయుక్తంగా ఉండేలా ప్రత్యేక ఆకర్షణగా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొనే జట్ల వివరాలు, ఇతర నిబంధనలు త్వరలోనే తెలియజేస్తామని ఆదిత్య చరణ్ మరియు జగదీష్
క్రికెట్ టీం కోఆర్డినేటర్స్
తెలియచేస్తామన్నారు.

190
8795 views