logo

AIMA VIZAG సింహాచలం *టిటిడి చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి నియామకం భక్తుల్ని అవమానించడమే...!!* పుడిపేద్ది శర్మ.

AIMA
VIZAG
సింహాచలం


*టిటిడి చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి నియామకం భక్తుల్ని అవమానించడమే...!!*

పుడిపేద్ది శర్మ.
విశ్వహిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత రాష్ట్రా టోలి కన్వీనర్
టిటిడి చైర్మన్ గా నియమించిన కరుణాకర్ రెడ్డి హిందువు కాదని, అతని పేరులోనే అన్యమతo పేరుతో ఉండటం జరిగింది. ఒక అన్యమతస్తుడిని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చైర్మన్గా ఎలా నియమిస్తారని గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇతన్నే నియమించి ఇదే తప్పుడు విధానాన్ని అవలంబించి ఆనాడు టీటీడీలో అన్యమతస్తుల్ని ఉద్యోగులుగా తీసుకోవడం జరిగిందని ఆనాటి ప్రభావమే నేడు తిరుమల కొండల్లో అన్యమత ప్రచారం యదేచ్చగా జరుగుతుందని దానికి మూల కారణం ఆనాటి నేటి కరుణాకర్ రెడ్డి అని అతన్ని మరల వైయస్ జగన్ ప్రభుత్వంలో ఎలా చైర్మన్గా నియమిస్తారని అతను మరలా టీటీడీ ఏడు కొండల్ని రెండు కొండలుగా మార్చే విధానం చేపడుతాడని ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని టిటిడి చైర్మన్ గా గతంలో ఒక అన్యమతస్తుడిని రెడ్డి ని నియమించారని మరలా ఇప్పుడు రెడ్డి నే నియమిస్తున్నారని రెడ్డిల సామాజిక వర్గం తప్పితే హిందువుల్లో ఏ సామాజిక వర్గం టిటిడి చైర్మన్ గా వైయస్ జగన్ ప్రభుత్వంలో పనికిరారా అని. గతంలో ఇదే కరుణాకర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పింక్ డైమండ్ మాయమైందని ఆనాడు తప్పుడు ప్రకటనలు ఇచ్చి ఇప్పటి ప్రతిపక్ష నేతపై అబద్ధాలు ప్రచారం చేశారని మరి ఈరోజు ఏ మొహం పెట్టుకొని టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తారని. పింక్ డైమండ్ గురించి జగన్ ప్రభుత్వం నేటివరకు ఎందుకు నోరు మెదప లేదని ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం అన్యమతస్తుల్ని కాకుండా హిందూ సమాజంలో వెంకటేశ్వర స్వామి పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తులని చైర్మన్గా నియమించాలని విశ్వహిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత రాష్ట్రా టోలి కన్వీనర్ పుడిపేద్ది శర్మ డిమాండ్ చేశారు.

పూడిపెద్ది శర్మ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షతన విజయ శంకర్ ఫణీంద్ర,మాధవి లత,నాగభూషణం,చంద్రశేఖర్,విజయ్ కుమార్ శర్మ,రామకృష్ణ,అప్పలనాయుడు,అజయ్ యాదవ్ మొదలగు వారు బీజేపీ,విశ్వహిందూ పరిషత్,దార్మిక సెల్ నుండి పాల్గొనగా

తేదీ ఆగస్ట్ 7, 2023 సోమవారం ఉదయం 10:30 గంటలకు తొలి పావంచ,సింహాచల పుణ్యక్షేత్రం,విశాఖపట్నం వద్ద
Haryana లోనూ, మణిపూర్ లోనూ హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలకు నిరసిస్తు పత్రికా సమావేశం ఏర్పాటు చేసినారు
పూడిపెద్ది శర్మగారుమాటలలో
ఉత్తర భారతదేశం నందు గల హర్యానా రాష్ట్రంలో నుహు జిల్లాలో విశ్వ హిందు పరిషత్ బజరంగ్ దల్ గో రక్షక్ లు పాల్గొని శాంతియుతంగా శోభాయాత్ర చేయుచుండగ వారిపై ముస్లింలు రాళ్లతో దాడి చేశారు ఇది దుర్మార్గమైన చర్య ప్రభుత్వం చొరవ తీసుకొని దాడి చేసిన వారిని దేశద్రోహం కేసు కింద అరెస్టు చేయమని విశ్వ హిందూ పరిషత్ కోరుచున్నది అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ రాష్ట్రంలో మైతీ,కుక్కి,నాగ మొదలగు గిరిజన తెగలు నివసిస్తుంటాయి ఆయా తెగల మధ్య ఎన్నో సంవత్సరాల నుండి ఆదిపత్య పోరు జరుగుతున్నది అది ప్రస్తుతం కుకీ మరియు మైతి తెగల మధ్య మారణకాండగా మారినది అసలు విషయాలు పక్కన పెట్టి క్రిస్టియన్ గ్రూపుల వారు అదేదో క్రిస్టియన్లపై జరుగుతున్న దాడులు అన్నట్టు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు అసలు గిరిజనులైన వారిని క్రిస్టియన్లుగా మార్చింది ఎవరు ఈ క్రిస్టియన్ గ్రూప్స్ వారు అవాస్తవాలను ప్రచారం చేయడం వలన దేశ సార్వభౌమత్వం దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు దీనిని విశ్వహిందూ పరిషత్ ఖండిస్తుంది
*పూడి పెద్ది శర్మ*
*విశ్వ హిందూ పరిషత్*
*రాష్ట్ర శాఖ మఠ్ మందిర్ టోలి*షత్

81
169 views
  
1 shares