logo

AIMA విశాఖపట్నం జూన్ 19 బాలికపై అత్యాచారం కేసులో. పూర్ణానంద సరస్వతి అరెస్ట్. కేసు నమోదు చేసిన ఎంవీపీ పోలీసులు

AIMA
విశాఖపట్నం
జూన్ 19


బాలికపై అత్యాచారం కేసులో.
పూర్ణానంద సరస్వతి అరెస్ట్.
కేసు నమోదు చేసిన ఎంవీపీ పోలీసులు
ఆధ్యాత్మిక వర్గాల్లో కలకలం


వెంకోజి పాలెంలో జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద సరస్వతి స్వామీజీని సోమవారం ఎంవీపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆశ్రమంలో స్వామీజీ వేధింపులకు పాల్పడడమే కాకుండా, బాలికపై LEADER అత్యాచారం చేసినట్టు అమరావతిలోని దిశ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు పూర్ణానంద సరస్వతి స్వామీజీని అరెస్ట్ చేయడం ఆధ్యాత్మిక వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తల్లిదండ్రులు చనిపోవడంతో అనాధగా మారిన 12 ఏళ్ల బాలికను, విజయవాడకు చెందిన ఆమె పెద్దమ్మ నగరంలోని వెంకోజి పాలెంలో గల జ్ఞానానంద ఆశ్రమంలో చేర్చింది. అయితే ఆశ్రమ నిర్వాహకుడైన పూర్ణానంద సరస్వతి స్వామీజీ కళ్ళు బాలికపై పడ్డాయి. బాలికను గొలుసులతో స్వామీజీ బంధించి అత్యాచారం చేసినట్టు బాధితురాలు చెస్తోంది. ఈ తరుణంలో బాలిక అతని చెంత నుండి తప్పించుకొని విజయవాడలోని పెద్దమ్మ వద్దకు చేరుకొని, జరిగిన విషయం చెప్పడంతో, పెద్దమ్మ సహాయంతో బాలిక అక్కడి దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్వామీజీపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక బంధువులు పోలీసులను కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు పంపించగా, అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో విజయవాడలోని దిశా పోలీసులు కేసును ఎంవీపీ పోలీసులకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం స్వామీజీని అదుపులోకి తీసుకున్నట్టు ఎంవీపీ సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. అయితే స్వామీజీ ఆశ్రమం ఈనెల 13 నుండి బాలిక కనిపించడం లేదని పూర్ణానంద సరస్వతి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేయడం గమనార్హం.తనకే పాపం తెలియదు, కుట్ర చేసి ఇరికించారు- స్వామీజీ..

ఇదిలా ఉండగా ఆశ్రమ భూములను కాజేయాలని కొందరు చూస్తున్నారని, అందులో భాగంగానే ఈ కుట్ర జరిగిందని పోలీసుల అదుపులో ఉన్న స్వామీజీ చెప్తున్నారు. దీనిపై తాను కోర్టులో న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. సింహాచల దేవస్థానం తప్పు చేస్తోందని, దేవస్థానం భూములు కబ్జాకు గురవుతున్నాయని ఫిర్యాదు చేస్తే పట్టించుకోరని, కాని తన పైన ఆశ్రమంపైన కక్ష కట్టి ఇలా చేస్తున్నారని చెప్పారు. ఒక్కప్పుడు ఆశ్రమంలో 1500మంది పిల్లలు ఉండే వారని, ఇప్పుడు 12 మంది మాత్రమే ఉంటున్నారన్నారు.

ఆధ్యాత్మిక సేవ చేస్తుంటే అడ్డుకుంటున్నారని, ఫిర్యాదురాలిని మచ్చిక చేసుకుని తనపై తప్పుడు ఫిర్యాదు చేయించారని, తగిన న్యాయ పోరాటం చేస్తానని స్వామీజీ వివరణ ఇచ్చారు. సీఐ మల్లేశ్వరరావు నేతృత్వంలో ఎంవీపీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

81
7568 views