logo

AIMA DEVOTIONAL NEWS VIZAG ఆషాఢ మాసం యొక్క ప్రాముక్యత ఏమిటి...? ఆషాఢ మాసము ఈ శోభకృత్ నామ సంవత్సర ఆషాఢ మాసారంభ

AIMA
DEVOTIONAL NEWS
VIZAG

ఆషాఢ మాసం యొక్క ప్రాముక్యత ఏమిటి...?

ఆషాఢ మాసము

ఈ శోభకృత్ నామ సంవత్సర ఆషాఢ మాసారంభము. ఈ సమయము నందు లగ్నము కర్కాటక లగ్నమునకు శుక్ర, కుజ లగ్నమునందు అష్టమమున శని వ్యయమున సూర్యుడు, చంద్రుడు కలయికచే అనావృష్టి యోగము కన్పడుచున్నది. వాతావరణము కలుషితమై ప్రజలకు అనారోగ్యములను కలుగజేయును. అష్టనుమున శని దశమ కేంద్రమున రాహువు, గురుడు, లగ్నమందు పూర్ణ జలరాశి సంచారముచే అతివృష్టి, అనావృష్టి మొదలగు ప్రకృతి వైపరీత్యములను, తుఫాను వాయుగుండం ద్వారా. కలుగజేయుటకు యతింతురు. షష్టమమందు కేతువు తోక చుక్కలు మొదలగు ఉత్పాతములను కలుగజేయును. దుర్యోగము గురుడు దశమ మందుండుటచే తప్పిపోవుటకు దోహదపడును. ఈ మాసమున రవి కర్కాటక రాశి యందు ప్రవేశించుచున్నాడు. తత్కాల లగ్నము ధనుస్సు లగ్నమునకు తృతీయమున శని పంచమమున గురువు, రాహువు, భాగ్యమున శుక్రుడు, కుజుడు, బుధుడు అష్టమ స్థానమున సంయోగముచే పూర్ణజలరాశి యందు వర్షము అధికముగా యుండును.

ఈ మాసం నందున వర్షము అధికముగా నుండును. ఈ మాసము నందు శుక్రుడు కుజుడు కర్కాటక రాశి యందు సంచారమున వర్షాభావము అధికముగా కన్పడుచున్నది.

ఆరుద్ర కార్తె :
22-6-2023న రా॥ 2-10 ని॥లకు సూర్యుడు ప్రవేశించుచున్నాడు. తత్కాల లగ్నము మేష లగ్నము. లగ్న తృతీయమందు శని చతుర్థమందు, గురుడు, దశమ కేంద్రమునందు | శుక్రుడు భాగ్యస్థానాధిపతి గురుడు లగ్నమందు వీక్షించుటచే, వాతావరణము నందు కొన్ని మార్పులు కన్పడుచున్నవి. వాతావరణం అనుకూలముగా ఉండక పోవచ్చును. ప్రకృతి వైపరీత్యములకు దోహదపడును.

శుక్రుడు
జూలై 5 వరకు కర్కాటక రాశి యందు సంచారమున పూర్ణ జలరాశి సంచారముచే శని కుంభరాశి యందు | సంచారముచే వాయు సహిత వృష్టులు అధికముగా వుండుటకు | దోహదపడును. వీదురు గాలులు వీచును. వర్ష లక్షణముండును. వాయు చలనములో మార్పులు సాయంకాలమునకు వాతావరణంలో మార్పులు రాత్రి అయస్కాంత శక్తి పెరుగుట ఖండవృష్టి మరియు లక్షములుండును. శుక్రుడు సింహరాశి ప్రవేశించుచున్నాడు. తత్కాల లగ్నం సింహం, కుజ, సూర్యుడు/ వ్యయమున సప్తమమున గురుడు షష్టమ కోణమునందు శని లాభ | స్థానమున బుధుడు వాయు సహిత వృష్టులు కలుగజేయును. లగ్నమునకు గురుని యొక్క దృష్టి విశేష వర్షమునకు దారి చూపును. అక్కడక్కడా భారతదేశమందు జల ప్రళయము జన నష్టము కలుగు ప్రమాదము లేకపోలేదు. షష్టస్థానమున శని యోగము వలన కొన్ని | ప్రకృతి వైపరీత్యములు సంభవించును. తుఫాను వర్షములు కూడా | కలుగుటకు యత్నము కలుగజేయును. కొన్నిచోట్ల అతివృష్టి.. కొన్ని రాష్ట్రములకు అనావృష్టి కలుగజేయును. శని పూర్ణజలరాశి యందు సంచారముచే వాయు చలనము విస్తారముగా నుండుటకు "మేఘవాతనపీడితా" అను సూత్ర క్రమంబున మేఘములు గాలిలో చెదరగొట్టబడి వాయు సహిత ఖండవృష్టులకు దోహదపడును. తుఫాను లక్షణములు కలుగును.

బుధుడు :
మిథునరాశి యందు బుధుడు జూలై 7 వరకు ఉండుటచే పాద జలరాశి -స్వస్థానమందుండుటచే అతివృష్టి అవకాశము కలుగును. పశువులకు అనుకూలవృష్టి ముఖ్యముగా ఉత్తరాంధ్ర రైతులలో ఆనందం కలుగును. కొన్ని అతివృష్టి, అనావృష్టి యోగములున్నను సాముదాయకముగా, ఈ యొక్క బుధుడు మిథునరాశి యందు సంచారమున అనుకూల పరిస్థితులు కన్పడుచున్నవి. బుధుడు కర్కాటకరాశి లోకి ప్రవేశించును. ఈ సమయము నందు కన్యాలగ్నం - నిర్జలరాశి సంచారము - వాతావరణం అనుకూలముగా నుండి, సస్యానుకూల వృష్టి కలిగి, పశుగ్రాసము అధికముగా లభించుటచే గోవులు పాలను ఇచ్చును. రవి, బుధుల సంయోగము ఉష్ణోగ్రత తగ్గుటకు ప్రజారంజకముగా ఉండుటకు దోహదపడును. వర్షపాతమధికముగా ఉండును. ఉత్తర భారతమున కొన్ని నదులు పొంగి పొరలి ప్రవహించును. జూలై ఆకరిన వర్షపాతము, తుఫాను హెచ్చరికలు, వాతావరణంలో పూర్తి మార్పులు కనబడుచున్నవి.

ఈ మాసమున సూర్యుడు మృగశిర కార్తె యందు ప్రవేశించునప్పుడు జలనాడి సంచారములో ఉన్నందున గాలిలో తేమ వర్షయోగము సూచించును. ఈ ప్రభావము వలన శుక్ల పక్షమున ఉత్తరాంధ్రయందు సస్యానుకూల వృష్టి కలిగి రైతులు ఆహ్లాదకరంగా ఉందురు. పశుగ్రాస కొరత తీరును. చెరువులు, కుంటలు, జల సమృద్ధి కలిగి యుండును. దక్షిణాది జిల్లాలలో కృష్ణపక్షము నుండి ఋతుపవన ప్రభావము అధికముగా ఉండును. సస్యానుకూల వృష్టి కలిగి వరినాట్లు కొన్ని ప్రాంతముల యందు ప్రారంభించుటకు అనుకూల పరిస్థితులు ఏర్పడును. ఆకాశము మేఘావృతమై చల్లని వాతావరణం, ఋతుధర్మము కలిగి ఉండును.

శ్లో॥ యది విధి దిష్ట్యం పతతి తటాకం
శుభ జల వృష్టిర్థన కణ వృద్ధి॥

సముద్ర తటాకమందు సముద్రపు ఒడ్డున రోహిణి వాసమై యున్న మాసమున సువృష్టి యుండును. సస్యవృద్ధి తృణ వృద్ధి ధన వృద్ధి యుండును. పాడిపంటలు సమృద్ధిగా యుండుటచే ధరలు సరసముగా వుండును.

36
2498 views
  
1 shares