logo
(Trust Registration No. 393)
अपने विचार लिखें....

AIMA
VIZAG


11, 12 తేదీల్లో వేద విద్యా సమ్మేళనం.


శంకరమఠంలో ఈ నెల 11, 12 తేదీల్లో 23వ వేద విద్యా సమ్మేళనం నిర్వహిస్తు న్నట్లు ఉత్తరాంధ్ర వేద విద్యా ట్రస్ట్ కార్యదర్శి కంభంపాటి భాస్కరరావు తెలిపారు. శంకరమ ఠంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కంచికామ కోటి పీఠాధిపతి శం కర విజయేంద్ర సరస్వతి ఆశీస్సులతో జరుగు తున్న ఈ వేద విద్యా సమ్మేళనంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 100 మంది వేద పండితులు, 120 మంది వేద విద్యార్థులు పాల్గొంటున్నట్లు చెప్పారు. అన్ని వేదాలు, వివిధ విభాగాల్లో పరీ క్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ప్రదానం చేస్తామని వెల్లడించారు. శంకరమఠం అధ్యక్షుడు డాక్టర్ రవిరాజు ముఖ్య అతిథిగా, శంకరమఠం ముఖ్య సలహాదారులు, సీనియర్ న్యాయవాది కె.వి. రామ్మూర్తి, స్ప్రింట్ ఎక్స్పోర్ట్స్ ఎండీ గుంటూరు పవన్కుమార్ అతిథులుగా పాల్గొంటారని పేర్కొన్నారు.


ఈ వార్తల్ని చూసినవారు గానీ మరియు మీ స్నేహితుడు గాని మీ బంధువులు కానీ పుట్టినరోజులు గాని కార్యక్రమాలు గాని యాడ్ ఇవ్వడం జరుగుతుంది. మా ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ తరపు నుంచి ప్రచారమాధ్యమాల్లో వేయడం జరుగుతాయి మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 9618688312/9010243952

17
2019 views