logo

అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్.

విజయనగరం: ఆగస్టు 5 గురువారం విజయనగరం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు. విజయనగరం జిల్లా, గుర్ల మండలం, అచ్చుతాపురం గ్రామ శివారులో ద్విచక్రవాహనంపై 49(180ml) మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు పట్టుకుని సదరు వ్యక్తిని మరియు ద్విచక్ర వాహనాన్ని తదుపరి చర్యల నిమిత్తం గుర్ల పోలీసువారికి అప్పగించడం జరిగింది. ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కానిస్టేబుల్స్ గోవింద్ మరియు సురేష్ లు పాల్గొన్నారు.

0
17272 views
  
1 shares