వీరన్న కమరావతి కళ్యాణ మహోత్సవం.
హైదరాబాద్ : అలియాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని లాల్గాడి మల్కపేట్లో నిర్వహించిన బీరన్న కమరావతి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు గ్రామీణ జీవితానికి వెన్నెముకలాంటివని అన్నారు. బీరన్న కమరావతి కళ్యాణ మహోత్సవం వంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకలు సమాజంలో ఐక్యతను పెంపొందించి, మన పూర్వీకుల వారసత్వాన్ని భావితరాలకు అందించే వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
అనంతరం మహోత్సవ నిర్వాహకులను అభినందించిన ఆయన, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ బీరన్న స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు.