ఎల్బీనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.
Hyd:ఎల్బీనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఎల్బీనగర్ పరిధిలోని NTR నగర్లో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. రోడ్డుపై నిలిపిన లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో ఎయిర్బ్యాగ్లు తెరుచుకున్నా ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఘటనను గమనించిన లోకల్స్ వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది.