logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శ్రీరామనవమి ఉత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా ఏర్పాట్లు

తొర్రూరు మార్చి 24:( AIMEDIA )డివిజన్ కేంద్రంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాల కరపత్రాన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మచ్చ సురేష్ ఆధ్వర్యంలో ఆవిష్కరించా రు .ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ పాటిమీద ఉన్న శ్రీ సీతారామ మందిరం వద్ద తన ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణ వసంత నవరాత్ర త్రయహ్నిక మహోత్సవాలు బుధవారం , గురువారం, శుక్రవారం మూడు రోజులు నిర్వహించనున్నామని, తెలిపారు. 25 బుధవారం రోజున ఉదయం ముత్తైదువు లచే పసుపు కొట్టే కార్యక్రమం అనంతరం విశ్వక్సేన పూజ కలశస్థాపన సాయంత్రం సౌందర్యలహరి సమూహము తొర్రూరు వారిచే సౌందర్యల హరి పారాయణం అనంతరం విష్ణు సహస్రనామ పారాయ ణం ,గురువారం ఉదయం స్వామి వారి కళ్యాణ తలంబ్రాలు కలుపుట మధ్యాహ్న సాయంత్రం పూజ తోపాటు వికాసతరంగిణి తొర్రూరు వారిచే విష్ణు సహస్రనామం పారాయణం, అనంతరం సుందర సత్సంగ్ వారిచే భజన, ఏర్పాటు చేశామని చెప్పారు . శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలను ఘనంగా కన్నుల పండుగ నిర్వహిస్తున్నామని, శుక్రవారం ఉదయం 6 గం.కు ప్రాత: కాల పూజ ,9 గం.లకు ఎదుర్కోలు, రామ మందిరం నుండి మంగళ వాయిద్యాలతో ఉత్సవ మూర్తుల సమేతంగా బయలు దేరి 10 గం.కు శివాలయం వద్ద కార్యక్రమం అనంతరం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తున్నామని అన్నారు. కల్యాణం అనంతరం క్యూ లైన్ లో స్వామివారి అక్షింతలు తీర్థప్రసాద వితరణ సాయంత్రం హోమము పూర్ణాహుతి అనంతరం శ్రీ సీతారామచంద్రమూర్తి పరిపాల సమేతంగా పట్టణ వీధుల్లో శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నామని అన్ని వ్యాపార వర్గాల సోదరులు సభ్యులు, భక్తులు అధికంగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేస్తూ, శ్రీ సీతారామచంద్ర కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పెరుమాళ్ళ చక్రపాణి చలువాది సత్యనారాయణ , ప్రధాన కార్యదర్శి తల్లాడ హీరాధార్ ఇతర కమిటీ సభ్యులు మచ్చ లక్ష్మయ్య, గోపారపు చంద్రమౌళి, శ్రీనివాస్ రావు, ఇమ్మడి రాంబాబు , రేగూరి శ్రీనివాస్ , శ్రీధర్, చిదురాల రవి బోనగిరి వెంకన్న , చిత్రపు పురుషోత్తం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలో మురళీకృష్ణ మందిరంలో పట్టణ, మండల ఆర్యవైశ్య సంఘం ,మురళీకృష్ణ మందిరం వారి నిర్వహణలో శ్రీ సీతారామచంద్ర కల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయా సంఘాల బాధ్యులు తెలిపారు

0
66 views

Comment