బిజెపి ధర్నా@hyd
హైదరాబాద్:హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగుల బకాయిల కోసం తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు తెలియజేసాను.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయ్యింది. అధికారంలోకి రావడానికి అనేక మాయమాటలు చెప్పి ప్రజలను వంచించి, మోసగించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
అధికారంలోకి వచ్చిన వెంటనే DA లు, PRC లు ఎప్పటికప్పుడు ఇస్తామని హామీ ఇచ్చారు. అన్ని రకాలుగా ఉద్యోగులకు ఫ్రెండ్లీగా ఉంటామని మాట ఇచ్చారు.
అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయినా ఇప్పటికీ DA లు, PRC లు లేవు.
పదవి విరమణ పొందిన కుటుంబాలలో ప్రశాంతత లేకుండా పోయింది. దాదాపు 70 మంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురుచూసి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రభుత్వాన్ని అడుగడుగున ప్రశ్నిస్తాం.
ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులకు మద్దతుగా తెలంగాణ బీజేపీ ఈ దీక్ష చేపట్టింది.
ఈ ప్రభుత్వం ఉద్యోగులను నిండా మోసం చేసిందని అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఒక నియంతృత్వ పాలన పోయి మరో నియంతృత్వ పాలన వచ్చింది.
చిత్తశుద్ధి ఉంటే.. 24 గంటల్లో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించి ఈ ప్రభుత్వం ఆదుకోవాలి.